పంచాంగం
తేదీ 06-11-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల పంచమి రా. 9.23 వరకు, తదుపరి షష్టి
నక్షత్రం: మూల ఉ 9.13 వరకు, తదుపరి పూర్వాషాడ
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: సా 4.00 నుంచి 5.00 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సొంత నిర్ణయాలు పనికిరావు. తొందరపడి ఆస్తి సంబంధ ఒప్పందాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపార భాగస్వామి మోసం చేసే ప్రమాదం ఉంది. పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి : అనుకూల సమయం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి అందిన వార్త చిన్నపాటి ఆందోళన కలిగిస్తుంది.
మిథున రాశి: మిశ్రమ కాలం. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాల మొదలు పెట్టొచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బంది పడతారు.
కర్కాటక రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలను సామరస్యంగా చర్చించుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి. ఖర్చులు పెరగడం వల్ల రుణాలు చేయాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మనస్పర్ధలు తొలగుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వారి ప్రవర్తన చిన్నపాటి ఆందోళనకు గురిచేస్తుంది.
సింహరాశి: అదృష్ట కాలం. గృహంలో చాలా రోజులుగా నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
కన్యారాశి: మిశ్రమ కాలం. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మొండి బకాయిలు చేతికందుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని ఫలితాలు లభిస్తాయి. ఇంటి పెద్దల ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి.
తులారాశి: చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పాత స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడి ఊహించని ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలను చేయాలనుకునే వారికి అనుకూల సమయం.
వృశ్చిక రాశి: మిశ్రమకాలం. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఇంటి పెద్దల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్తుకు సంబంధించి జీవిత భాగస్వామితో చర్చలు జరుపుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
ధనస్సు రాశి: మిశ్రమ కాలం. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నూతన విద్యా అవకాశాలను విద్యార్థులు అందుకుంటారు. గతంలో చేసిన పొరపాట్ల వల్ల పై అధికారుల మందలింపు ఉంటుంది. స్థానచలనం కూడా జరగవచ్చు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మకర రాశి: కష్టకాలం. గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వారితో విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం తగదు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడతాయి. డబ్బుల విషయంలో ఆప్తులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.
కుంభరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను తల్లితో చర్చించడం ద్వారా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పోటీతత్వం పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
మీనరాశి: అదృష్ట కాలం. సకాలంలో స్నేహితుల నుంచి సాయం పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇతరుల మెప్పు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం.