పంచాంగం
తేదీ 06-02-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల నవమి రా. 1.07 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: కృత్తిక రా. 9.48 వరకు, తదుపరి రోహిణి
శుభ సమయం: ఏమి లేవు
దుర్ముహూర్తం: ప. 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ. 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సమయాన్ని వృధా చేయకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి.
వృషభ రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవసరానికి తోబుట్టువులు సాయం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి.
మిథున రాశి: కొన్ని విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు పనికిరావు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. గిట్టని వారు తప్పుదారి పట్టించాలని చూస్తారు. ఉద్యోగులు మహిళా ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి: కుటుంబంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలి. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. అనుకోకుండా న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఇంటి పెద్దల సహకారంతో వాటిని పరిష్కరించుకోవాలి.
సింహరాశి: అనుకూల సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
కన్యా రాశి: ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర విషయాలపై సమయం వృధా చేసుకోకండి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
తులారాశి: కష్టకాలం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. పరిస్థితులను బట్టి ముందుకు సాగడం మంచిది. ఎవరితోనైనా విభేదించాల్సి వచ్చినప్పుడు సంయమనం పాటించండి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. కొద్దిపాటి ఆస్తి నష్టం సంభవిస్తుంది.
వృశ్చిక రాశి: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కాలానుగుణంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆత్మ పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు రాశి: ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా వాటిని నిర్వర్తించ గలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. స్నేహితులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరరాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. మొహమాటాన్ని దరిచేరినివ్వకండి.
కుంభరాశి: ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న ఉద్యోగులకు అనుకూల సమయం. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. స్థిరమైన నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి.
మీన రాశి: మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. రాజకీయ రంగాలవారు నూతన పదవులతో పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.