పంచాంగం:
తేదీ 05-11-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల చవితి రా. 9.25 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ 7.59 వరకు, తదుపరి మూల
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అడ్డంకులు తొలగిపోతాయి. సొంత నిర్ణయాలు సమస్యలకు దారి తీయచ్చు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి.
వృషభ రాశి: ఆదాయానికి ఖర్చులకి మధ్య సమతుల్యం పాటించాలి. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రతికూల సమయాల్లో సంయమనం పాటించడం మంచిది. ఉద్యోగ మార్పు సూచన కనిపిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు మార్గం సుగమవుతుంది. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఎవరినీ నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోరాదు.
మిథున రాశి: చట్టపరమైన వివాదాలు కొలిక్కి వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో మీ సమస్యలను చర్చించడం వల్ల పరిష్కారం అవుతాయి. గిట్టని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి.
కర్కాటక రాశి: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తండ్రితో విభేదిస్తారు. ఫలితంగా మానసిక ఆందోళనకు గురవుతారు. భాగస్వామి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అది వివాదానికి దారితీస్తుంది. సంయమనం పాటించాలి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. తొందరపడి ఎటువంటి వాగ్దానాలు చేయరాదు.
సింహ రాశి: ఉత్సాహంగా పనిచేస్తారు. ముఖ్యమైన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త గా ఉండాలి. ఉద్యోగార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కన్యా రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి పొందే అవకాశం ఉంది. సత్ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు. పెద్ద మొత్తంలో రుణాలు తీర్చగలుగుతారు.
తులా రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తి పై నెలకొన్న వివాదాల్లో పై చేయి సాధిస్తారు. చాలా కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తను వింటారు. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మ విశ్వాసం తో మొదలుపెట్టే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి: అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తపరుచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రాణ స్నేహితుడికి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: వ్యాపార భాగస్వామి చేసే మోసం వల్ల వ్యాపారంలో తీవ్ర నష్టం సంభవిస్తుంది. తొందరపాటు నిర్ణయం సమస్యలకు దారితీస్తుంది.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తీవ్రమవుతాయి.
మకర రాశి: సంపద పెరుగుతుంది. వ్యాపారుల ప్రణాళికలు ఊపందుకుంటాయి. తద్వారా మంచి లాభాలు పొందుతారు. పిల్లల ప్రవర్తన చిన్నపాటి కలవరానికి గురిచేస్తుంది. వారిని గమనిస్తూ ఉండాలి. అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. చాలాకాలం తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
కుంభ రాశి: మిశ్రమకాలం. ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. తండ్రితో చర్చించడం ద్వారా వాటి నుంచి బయటపడతారు. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మీన రాశి: ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోక పోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయరాదు. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్నవారు తప్పుదోవ పట్టించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. చేయని తప్పుకు నిందలు పడాల్సి రావచ్చు. తోబుట్టువులతో డబ్బు విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి.