పంచాంగం
తేదీ 05-02-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి తె 5.31 వరకు, తదుపరి అష్టమి తె 3.31 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: భరణి రా. 11.19 వరకు, తదుపరి కృత్తిక
శుభ సమయం: ఏమి లేవు
దుర్ముహూర్తం: ప. 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సమస్యలు చుట్టుముట్టడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్ధలు తీవ్రం కాకుండా చూసుకోవాలి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపకండి.
వృషభ రాశి: అదృష్ట కాలం. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. ఆస్తిని కొనుగోలు చేస్తున్నట్లయితే అందుకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మిథున రాశి: మిశ్రమ కాలం. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఆశించిన ఫలితాలు పొందుతారు. విజయపథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త బాధపెడుతుంది. కీలక సమయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. కోపాన్ని దరిచేరనివ్వకండి. వ్యాపార ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. తెలివిగా వ్యవహరించండి.
కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తోబుట్టువుల సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహరాశి: ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం పాలవడం వల్ల ఆందోళన చెందుతారు.
కన్యారాశి: ఆదాయ వనరులను పెంచుకుంటారు. కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలి. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. తోబుట్టువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి.
తులారాశి: చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. వ్యాపారులు మొండి బకాయిలను తిరిగి పొందుతారు. వ్యాపార భాగస్వామి ప్రవర్తన గమనిస్తూ ఉండండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.
వృశ్చిక రాశి: శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు. ఫలితంగా ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు తీర్చగలుగుతారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి.
ధనస్సు రాశి: భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు ఇతరులపై ఆధారపడి నష్టపోవాల్సి రావచ్చు. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయండి.
మకర రాశి: కుటుంబ సభ్యుల సాయంత్రం చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి.
కుంభరాశి: ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. వారి పనితీరు పట్ల అధికారులు సంతృప్తిగా ఉంటారు. అడ్డంకులు తొలగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయటం మంచిది.
మీన రాశి: అనుకూల సమయం.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు చేయాలనుకునే వారికి సరైన సమయం. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. ఇంటి పెద్దలతో చర్చించడం ద్వారా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.