పంచాంగం:
తేదీ 04-11-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల తదియ రా. 8.55 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: అనురాధ ఉ 7.55 వరకు, తదుపరి జ్యేష్ఠ
దుర్ముహూర్తం: మ. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి మ. 2.46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: ఉ 6.00 నుంచి 7.00 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కష్టకాలం. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీ మంచి స్వభావాన్ని ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఫలితంగా ఏ పనీ పూర్తికాదు. బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు.
వృషభ రాశి: కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇంటి పెద్దల సాయంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆప్తులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు విశేషమైన లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టులను ఈరోజు మొదలు పెట్టొచ్చు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
కర్కాటక రాశి: ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాలు పనికిరావు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వ్యాపార భాగస్వామి తో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తుతాయి. ఫలితంగా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహరాశి: మిశ్రమకాలం. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
కన్యారాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఆస్తి సంబంధ విషయమై ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ కాస్త ఎక్కువ అవుతుంది.
తులారాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండాలి. అనవసర ఆలోచనలు ఒత్తిడిని పెంచుతాయి. వివాదాలకు చోటు ఇవ్వకండి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టేటప్పుడు ఆప్తుల సలహా తీసుకోండి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను వాయిదా వేయండి.
వృశ్చిక రాశి: తల్లిదండ్రుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. నూతన వస్తూ, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లలతో సమయానికి కేటాయించడానికి ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ధనస్సు రాశి: ప్రత్యర్థులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు మనోబలంతో వాటిని ఎదుర్కోవాలి. ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకండి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. అనవసర ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు ఆలోచనను వాయిదా వేయడం మంచిది.
మకర రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు విశేషమైన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి: చేపట్టిన పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలంతో వాటిని ఎదుర్కోవాలి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. అవసరానికి తోబుట్టువుల సాయం అందుతుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఆలోచనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు.
మీనరాశి: ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆందోళన చెందుతారు. పిల్లల ప్రవర్తన కలత చెందుతారు. వ్యాపారులు స్వల్ప నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు కాకుండా ఇంటి పెద్దల సలహా తీసుకోండి.