Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 04 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 04-02-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల షష్ఠి ఉ 7.53 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: అశ్విని రా. 12.52 వరకు, తదుపరి భరణి
శుభ సమయం: సా 4.22 నుంచి 5.22 వరకు
దుర్ముహూర్తం: ప. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: సా. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు.

వృషభ రాశి: కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నించాలి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల పని ఒత్తిడి ఎక్కువవుతుంది. అలసటకు గురవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మిథున రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవివాహితులు వివాహానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయత్నానికి తొలి అడుగు పడుతుంది.

కర్కాటక రాశి: మిశ్రమకాలం. అనుకున్న ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది.

సింహరాశి: ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. కొన్ని వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. లాభాలు రాబట్టడానికి వ్యాపారులు తీవ్రంగా శ్రమించాలి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

కన్యా రాశి: కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఆందోళనకు గురిచేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు ఏర్పడతాయి. సంయమనంతో వాటిని పరిష్కరించాలి. వ్యక్తిగత విషయాలను అపరిచితులతో పంచుకోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి.

తులారాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి: అదృష్ట కాలం. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన మనస్పర్ధలు తొలగిపోతాయి.

ధనస్సు రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. మంచి పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవి లాభ సూచితం.

మకర రాశి: ఒక వ్యవహారంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుతాయి. విలువైన వస్తువులను కొరుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది.

మకర రాశి: గొప్ప వ్యక్తులు పరిచయమవుతారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి ఉంది. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మనశ్శాంతిని పొందుతారు.

కుంభరాశి: మిశ్రమకాలం. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. కొన్ని విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు సరికావు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొహమాటానికి తావివ్వకండి.

మీన రాశి: ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆస్తి సంబంధ వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...

ఎక్కువ చదివినవి

Sankranthiki vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వచ్చాక వెంకటేశ్ కొట్టిన రికార్డులివే..

Sankranthiki vasthunnam: ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ సాధించిన విజయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి.. పాటలు, కామెడీతో అలరించింది. తెలుగులోనే విడుదలై.....

వైసీపీని క్రమంగా జనం మర్చిపోతున్నారు.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, ఓ వైపు సినిమాలు చేస్తూ.. ఇంకో వైపు, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న...

వైసీపీకి ఆ కీలక ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పనున్నారా.?

‘మేం శాసన మండలిలో ప్రభుత్వంతో పోరాడుతోంటే, కనీసం శాసన సభ్యుడిగా మీరు శాసన సభకి హాజరై, వైసీపీ వాయిస్‌ని బలంగా వినిపించకపోతే ఎలా.?’ వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు, తమ అధినేత వైఎస్...

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...