పంచాంగం
తేదీ 04 – 08 – 2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు.
తిథి: అమావాస్య ప. 3.43 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: పుష్యమి ప. 1.53 వరకు, తదుపరి ఆశ్లేష.
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు.
శుభ సమయం: ఏమీ లేవు.
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు.
యమగండం: ప. 12.00 నుంచి 1.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. వ్యాపారంలో మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి.
వృషభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి.పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడటం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు అందుతాయి. స్వల్పంగా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి.
మిథున రాశి: ఒత్తిడితో కూడుకున్న రోజు. తొందరపాటు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. న్యాయపరమైన చిక్కుల్లో పడతారు.
కర్కాటక రాశి: గందరగోళ వాతావరణం ఉంటుంది. పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ఇప్పటికే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపరాదు.
సింహరాశి: వ్యాపారులు గణనీయమైన లాభాలను పొందుతారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు. స్థానచలనం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కన్యారాశి: వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన ఒప్పంద పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం కష్టమవుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
తులారాశి: ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. ఇందులో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత సమస్యలను స్నేహితులతో చర్చించడం ద్వారా పరిష్కారమవుతాయి.
వృశ్చిక రాశి: అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ధనస్సు రాశి: ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు మొండి బకాయిలు అందుతాయి. వ్యాపారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల గణనీయమైన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు.
మకర రాశి: వ్యాపారంలో కొన్ని చిక్కులు ఏర్పడతాయి. నష్టాలను చవిచూస్తారు. ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత సంభాషణ ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించాలి. సహనంతో వ్యవహరించాల్సిన సమయం. ప్రత్యర్ధులు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి: కొత్త పనులు ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూల సమయం. మీ మాటల ద్వారా సహోద్యోగులు నొచ్చుకోవచ్చు. కాబట్టి వారితో భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సంభాషించాలి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి: మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. ఆరోగ్య సమస్యలను విస్మరించరాదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.