పంచాంగం
తేదీ 03-11-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల విదియ రా 7.55 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: అనురాధ పూర్తిగా
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉ 7.00 నుంచి 9.00 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకునే ఈ రాశి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. అనవసర విషయాల్లో తల దూర్చడం మంచిది కాదు. అది పొరపాట్లకు దారి తీయొచ్చు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అప్రమత్తంగా ఉండాలి.
వృషభ రాశి: ఈరోజు ఈరోజు వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పు కోరుకోవాలనుకునే వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. పని భారం ఎక్కువవుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఏదైనా సమస్య తలెత్తితే వైద్యున్ని సంప్రదించడం మంచిది. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహా కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది.
మిథున రాశి: న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నవారు బయటపడతారు. ఉద్యోగులకు గుర్తింపు ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. కుటుంబ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి వివాదాల్లోనూ తల దూర్చరాదు. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేయగలుగుతారు. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
సింహరాశి: అనుకూల సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు విశేషమైన లాభాలు గడిస్తారు.
కన్యా రాశి: ఈరోజు ఈ రాశి వారు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఆదాయం, ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. పొదుపు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
తులారాశి: పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఆలోచనను ఆచరణలో పెట్టొచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రమేయంతో ఇంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రుణాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవాల్సి రావచ్చు.
వృశ్చిక రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారి పరిచయం భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇంటి పెద్దల ఆరోగ్యం క్షీణిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి: సామాజిక రంగాల్లో పనిచేసే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పని భారం ఎక్కువవుతుంది. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రత్యర్ధులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉండే వారికి ప్రమోషన్లు అందుతాయి. పై అధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించరాదు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను ఆచరణలో పెట్టడానికి సరైన సమయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు చేతికందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపార ప్రణాళికలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కుంభరాశి: మిశ్రమ కాలం. చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని సమస్యలు ఖర్చులను పెంచుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే వారికి సరైన సమయం. ముఖ్యమైన పనిని వాయిదా వేయరాదు. వ్యాపారం విషయంలో కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు.
మీన రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.