Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 03 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 03-02-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల పంచమి ఉ 10.13 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం: రేవతి రా. 2.46 వరకు, తదుపరి అశ్విని.
శుభ సమయం: ఉ 5.46 నుంచి 6.22 వరకు, తిరిగి సా 6.58 నుంచి 7.22 వరకు
దుర్ముహూర్తం: మ. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి 2.46 నుంచి 3.12 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కుటుంబ బాధ్యతలను విస్మరించడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. పెద్దవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మాటల్లో పొదుపు పాటించడం మంచిది. కొన్ని విషయాల్లో సంయమనం పాటించక తప్పదు. మీ సంభాషణను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.

మిధున రాశి: మిశ్రమకాలం. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. అందరితోనూ మిత సంభాషణ మంచిది. పూర్వీకుల ఆస్తి సంబంధ విషయాల్లో పై చేయి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులో గణనీయమైన లాభాలను పొందుతారు.

సింహరాశి: వ్యాపారంలో ఏవైనా మార్పులు చేదల్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. తల్లిదండ్రుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కన్య రాశి: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. సత్ప్రవర్తనతో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

తులారాశి: ఈరోజు వారు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని భారం ఎక్కువవుతుంది. ఫలితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి: అదృష్ట కాలం. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. పురోగతిలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆప్తులతో విలువైన సమయాన్ని గడుపుతారు. అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు ఈరోజు అనువైన సమయం.

ధనస్సు రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. పనుల్లో జాప్యం కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆలోచనల్లో నిలకడ అవసరం. సొంత నిర్ణయాలు తీసుకోకండి.

మకర రాశి: మిశ్రమ కాలం. సత్ప్రవర్తనతో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ బాధ్యతలు అందుతాయి. సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు.

కుంభరాశి: మిశ్రమకాలం. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మీన రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మి వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీల గురించి పంచుకోరాదు. ఉద్యోగులు యజమానులతో జాగ్రత్తగా సంభాషించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంటి పెద్దలతో విభేదించాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఎక్కువ చదివినవి

అన్య మతస్తులైన కిరాయి మూకల్ని జనసేనపైకి ప్రయోగిస్తున్నదెవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కోసం నడుం బిగించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే, హిందువునైన తాను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇతర మతాల్ని గౌరవించడం.. అని...

మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ వచ్చేసింది..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా మ్యాడ్. యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. కళ్యాణ్ శంకర్...

బెట్టింగ్ యాప్స్.! ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకే కోట్లు చెల్లించారా.?

బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దయెత్తున సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ.....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...