Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 03 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 03-04-2025, గురువారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల షష్టి తె 3 38 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: రోహిణి మ 12.24 వరకు, తదుపరి మృగశిర
శుభ సమయం: ఉ 10.58 నుంచి 11.33 వరకు, తిరిగి సా 4.40 నుంచి 6.10 వరకు
దుర్ముహూర్తం: ఉ 10.06 నుంచి 12.24 వరకు, మ 2.48 నుంచి 3.12 వరకు
రాహుకాలం: మ 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రోత్సాహకర వాతావరణ ఉంటుంది.

వృషభ రాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మిథున రాశి: ఇతరులతో ఆచితూచి సంభాషించండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీ ప్రవర్తన వల్ల ఇష్టమైనవారు దూరమవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల రుణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి: భవిష్యత్తుకు మేలు చేకూర్చే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.

సింహరాశి: చేపట్టిన పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు.

కన్య రాశి: కీలక వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. జీవిత భాగస్వామితో ఒక వ్యవహారంలో విభేదించాల్సి వస్తుంది. ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల మనస్పర్ధలు తలెత్తుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరగడం వల్ల శారీరక అలసటకు లోనవుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తులారాశి: ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఖర్చులను నియంత్రించుకో గలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట పై చేయి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.

వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు కలత చెందుతారు. చేపట్టిన పనులు ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల రుణాలు చేస్తారు.

ధనస్సు రాశి: అనుకూల సమయం. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

మకర రాశి: ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభరాశి: అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కకపోవడం వల్ల నిరుత్సాహ పడతారు. కొంత మేర ఆస్తినష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో విభేదించాల్సి వస్తుంది.

మీన రాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.సమయానుకూలంగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

87వ రోజు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి ప్రజా సమస్యలకు వేదికైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 87వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

పెళ్లి బ్రేక్ తర్వాత నార్నే నితిన్ కొత్త సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నార్నే నితిన్ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన...