పంచాంగం
తేదీ 31-10-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు
తిథి: బహుళ చతుర్దశి ప. 2.43 వరకు, తదుపరి అమావాస్య
నక్షత్రం: చిత్త రా. 12.14 వరకు తదుపరి స్వాతి
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00నుంచి 12.00 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: అదృష్ట కాలం. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధువులతో నెలకొన్న మాట పట్టింపులు తొలగిపోతాయి.
వృషభ రాశి: మానసిక సంతోషాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిధున రాశి: బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కుటుంబంలో అనవసరమైన విభేదాలు తలెత్తుతాయి. ఆప్తుల ప్రవర్తనతో కలత చెందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు తోడవుతాయి. ఆరోగ్యం స్వల్పంగా క్షీణిస్తుంది.
కర్కాటక రాశి: ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
సింహరాశి: ఉద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు అందుతాయి. న్యాయవాద రంగంలో ఉన్నవారికి ఊహించని పదవీ బాధ్యతలు అందుతాయి. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు.
కన్య రాశి: ఆప్తులతో మాట పట్టింపులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి రుణాలు చేయాల్సి రావచ్చు.
తులారాశి: సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వ్యాపారులు విశేషమైన లాభాలు పొందుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. వ్యక్తిగత సమస్యలను ఇంటి పెద్దల జోక్యంతో పరిష్కరించుకుంటారు.
ధనస్సు రాశి: మిశ్రమకాలం. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ప్రత్యర్థులు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు భాగస్వామ్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
మకర రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
కుంభరాశి: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి.
మీన రాశి: మిశ్రమకాలం. పని భారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం.
When someone writes aan pirce off writing he/she retins the thought off a uuser inn his/her mind that how a uswr can know it.
Therefore that’s why this rticle is amazing. Thanks!