Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 జనవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 31-01-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: శుక్ల విదియ సా.4.18 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: ధనిష్ట ఉ 8.08 వరకు తదుపరి శతభిషం.
శుభ సమయం: ఉ 9.21 నుంచి 9.51 వరకు, సా. 4.21 నుంచి 4.33 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ 12.24 నుంచి 1.12 వరకు.
రాహుకాలం: ప. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యమైన పనులను, ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయండి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి.

వృషభ రాశి: కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన వ్యక్తి పరిచయం అవుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి: మిశ్రమ కాలం. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి: అదనపు బాధ్యతలు పెరగడం వల్ల శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. ఇంటి పెద్దల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆందోళన చెందుతారు. ప్రమాదం అనుకునే ఏ పని మొదలు పెట్టకపోవడం మంచిది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయండి.

సింహరాశి: బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కోరుకున్న చోటికి స్థానచలనం లభిస్తుంది.

కన్యా రాశి: సానుకూల దృక్పథంతో మొదలుపెట్టే పనులు విజయవంతం అవుతాయి. మీ పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి.

తులారాశి: కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు చికాకు కలిగిస్తాయి. ఆప్తుల నుంచి అందిన వార్తతో ఆందోళన చెందుతారు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి

వృశ్చిక రాశి: మనసు చెడు ఆలోచనల వైపు మళ్లుతుంది. స్థిరమైన ఆలోచనలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. కొందరు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. అపరిచితులతో ఆర్థిక వ్యవహారాలు జరపరాదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.

ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

మకర రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకున్న ఫలితాలు రావటానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కుంభరాశి: వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు వస్తాయి. మీ పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఇష్టమైన వ్యక్తులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

మీన రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీకు అనుకూలంగా లేని చోట మౌనంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. చేయని తప్పుకు మాటలు పడాల్సి రావచ్చు.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్ చూసి ఫిదా కానివారు లేరు. క్లిష్టమైన...

Daily Horoscope: ఉద్యోగ అవకాశాలు – సింహానికి శుభవార్త, ధనుస్సుకు ఆర్థిక లాభ సూచనలు

ఫిబ్రవరి 28, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మీపై వస్తాయి. సహచరుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో శాంతంగా ఉండాలి. ఖర్చుల...

లీన్ లుక్ తర్వాతే ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్ ప్లాన్ ఇదే

పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించిన అభిమానులకు తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పూర్తిగా లీన్ లుక్ సాధించిన తర్వాతే ‘స్పిరిట్’...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.. ఎలాగంటే

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన వారెందరో ఉన్నారు. అయినా.. ఆమె వృధ్యాప్య...