పంచాంగం
తేదీ 30-11-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:25 గంటలకు.
తిథి: బహుళ చతుర్దశి ఉ 9.34 వరకు, తదుపరి అమావాస్య
నక్షత్రం: విశాఖ ప. 12.36 వరకు, తదుపరి అనురాధ
శుభ సమయం: ఉ 11.00 నుంచి 1.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7. 36 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో గందరగోళ వాతావరణం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి వాటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీవ్రంగా శ్రమించినప్పటికీ కొన్ని పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను ప్రస్తుతానికి విరమించడం ఉత్తమం.
మిథున రాశి; ఈ రాశి వ్యాపారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామ్యులు మోసం చేసే ప్రమాదం ఉంది. ఎవరి మాటలకు ప్రభావితమై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టరాదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో నీ ప్రమేయం లేనప్పటికీ నిందలు పడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి: బంధుమిత్రుల నుంచి అందిన వార్త ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. మీ బాధ్యతలను విస్మరించకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కీలక సమయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లాభాలను పొందుతారు.
కన్యారాశి: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆప్తులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
తులారాశి: ఏ విషయంలోనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. చంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. ప్రత్యర్థులు వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. తోబుట్టువుల నుంచి అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్తలు అందుకుంటారు.
ధనస్సు రాశి: అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను పోగొట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి.
మకర రాశి: ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఆలోచనల వల్ల సమయం వృధా అవుతుంది. వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోరాదు. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది.
కుంభరాశి: సమయానుకూలంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన విషయాల్లో జాప్యం పనికిరాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉంది. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.
మీనరాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమయానుకూలంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.