పంచాంగం
తేదీ 30- 07- 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు.
తిథి: బహుళ దశమి సా. 6.42 వరకు తదుపరి ఏకాదశి.
నక్షత్రం: కృత్తిక ప. 1.34 వరకు, తదుపరి రోహిణి.
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి పెద్దల ఆశీర్వాదంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్ద మొత్తంలో అప్పులు చెల్లించ గలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభ రాశి: నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. మొండి బకాయిలు చేతికందుతాయి. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు చేజిక్కుతాయి.
మిథున రాశి: శుభ సమయం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. అయితే వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
కర్కాటక రాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైన పనులను మొదలుపెట్టేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయాలి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నేహితుల్లో ఒకరిని కోల్పోవాల్సి రావచ్చు.
సింహరాశి: ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో నెలకొన్న సమస్యలను ఇంటి పెద్దలతో చర్చించడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. సమస్య తీవ్రం కాకుండా సహనంగా ఉండాలి.
కన్యా రాశి: ప్రతికూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ నొచ్చుకునేలా మాట్లాడరాదు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్వల్ప నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
తులారాశి: వ్యాపారులు శుభవార్తలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినవారు గణనీయమైన లాభాలు పొందుతారు. ఏదైనా ప్రాజెక్టు నిలిచిపోయి ఉంటే అది ఈరోజు పూర్తవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయంలో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి: దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. వ్యాపార భాగస్వామి ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆర్థిక లావాదేవీల గురించి ఎవరితోనూ చర్చించరాదు. పిల్లల ప్రవర్తనతో కలత చెందుతారు.
ధనస్సు రాశి: వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. కొంతమేర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రుణాలు చేయరాదు. ఎవరితోనూ విభేదాలకు దిగరాదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సంభాషించాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: శుభకాలం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సమర్థమవుతున్న వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అత్యంత అనుకూల సమయం. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుకుంటారు. విద్యార్థులు నూతన అవకాశాలను పొందుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకండి.
కుంభరాశి: అనుకూల సమయం. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. విశేషమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. తమ సమయస్ఫూర్తితో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విజయపథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మీన రాశి: ఈరోజు సమస్యలతో నుండి ఉంటుంది. పిల్లలను గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ బాధిస్తుంది. నమ్మిన వారి ప్రవర్తనతో కలత చెందుతారు. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. కుటుంబ సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరితోనైనా విభేదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మంచిది. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
