పంచాంగం
తేదీ 30-01-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు
తిథి: శుక్ల పాడ్యమి సా. 5.47 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: శ్రవణం 8.49 వరకు, తదుపరి ధనిష్ట
శుభ సమయం: సా. 5.20 నుంచి 6.08 వరకు
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ. 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దమతంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి.
వృషభ రాశి: శ్రమ ఎక్కువవుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అలసటకు గురవుతారు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. మనసు చెడు పనుల వైపు మల్లుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
మిథున రాశి: మిశ్రమకాలం. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. అవసరానికి బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్త కలవరపెడుతుంది. సానుకూల దృక్పథంతో ఉండండి. ప్రత్యర్ధులు తప్పుదారి పట్టించాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు మేలైన ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహరాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు.
కన్యా రాశి: మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
తులారాశి: పెద్దవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండండి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. కొంతమేర ఆస్తి నష్టం జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి: ఉద్యోగులకు కోరుకున్న చోటుకు స్థానచలనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలను తొలగించే ప్రయత్నం చేయాలి. ఇంటి పెద్దల సహకారంతో వ్యక్తిగత సమస్యల పరిష్కరించుకుంటారు.
ధనస్సు రాశి: ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గిట్టని వారు తప్పుదారి పట్టించాలని చూస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులు సలహా తీసుకోండి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి.
మకర రాశి: ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సత్ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుతుంది.
కుంభరాశి: ఉద్యోగులు పై అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పని చేసే చోట కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. అందరితోనూ మిత సంభాషణ మంచిది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
మీన రాశి: మిశ్రమ కాలం. గతంలో ఇబ్బంది అనారోగ్య సమస్య మళ్లీ తిరగబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి మనస్పర్దలు ఏర్పడతాయి. సంయమనం పాటించండి. బంధువుల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.