Switch to English

రాశి ఫలాలు:మంగళవారం 30 నవంబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం : సా‌.5:20
తిథి: కార్తీక బహుళ ఏకాదశి రా.9:59 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ ద్వాదశి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: హస్త సా.5:08 వరకు తదుపరి చిత్త
కరణం: బవ ఉ.10:39 తదుపరి భాలవ
యోగం: ఆయుష్మోన్ రా.9:39 వరకు తదుపరి సౌభాగ్యం
వర్జ్యం: రా.12:47నుండి 2:19 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:22 నుండి నుండి 9:07 వరకు తదుపరి రా.10:29 నుండి 11:07 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:04 నుండి 1:27 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:57 నుండి 5:45 వరకు
అమృతఘడియలు: ఉ.11:15 నుండి మ.12:49 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:42 నిమిషము ల నుండి మ.12:26 నిమిషము ల వరకు

ఈరోజు (30-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.

మిథునం: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

సింహం: ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి.ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

వృశ్చికం: ధనాదాయ మార్గలు పెరుగుతాయి.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు: చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం: సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి.

కుంభం: అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.

మీనం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఔనా, జనసేనకు ఆ స్థాయిలో ఓటు బ్యాంకు పెరిగిందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ జనంలోకి రాలేకపోతున్నారు. కరోనా పాండమిక్ అలాగే తాను కమిట్ అయిన సినిమాల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం.. ఇలా పలు...

ఎక్కువ చదివినవి

ఇంప్రెస్ చేస్తోన్న శ్యామ్ సింగ రాయ్ డిలీటెడ్ సీన్

న్యాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది....

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

పీఆర్సీ రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఇప్పటికే సీఎస్ కు నోటీసు ఇచ్చారు. ఈక్రమంలో ఏపీ పీఆర్సీ సాధన సమితి కార్యాచరణలో...

జస్ట్ ఆస్కింగ్: గుడివాడ నిషేధిత ప్రాంతమా.?

గుడివాడలో ఏదో జరుగుతోంది. అధికార వైసీపీ ఎందుకో కంగారు పడుతోంది. లేకపోతే, గుడివాడలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్ని ప్రవేశించనివ్వట్లేదు. తాజాగా బీజేపీ నేతలనూ పోలీసులు అడ్డకుంటున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు...

పాఠశాలల పునః ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏంటీ?

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ను పునః ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ లో...

ఈసారైనా కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ విడుదలవుతుందా?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫీమేల్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా గుడ్ లక్ సఖి మరోసారి విడుదలకు సన్నద్ధమైంది. ఈ చిత్రం గతంలో పలు సార్లు విడుదలను షెడ్యూల్ చేసుకుంది. నవంబర్...