పంచాంగం
తేదీ 02-11-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు
తిథి: శుక్ల పాడ్యమి సా. 6.30 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: విశాఖ తె 5.16 వరకు, తదుపరి అనురాధ
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి: ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. అనవసర ఆలోచనలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. మాటల్లో పొదుపు పాటించడం మంచిది. భాగస్వామి ప్రవర్తన విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి: సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవరితోనూ వ్యాపార సంబంధ విషయాలు పంచుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటక రాశి: వస్త్ర వ్యాపారులు విశేషమైన లాభాలు అందుకుంటారు. న్యాయవాద వృత్తి లో ఉన్నవారు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహరాశి: మానసిక ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్య రాశి: ఏ పనైనా కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలను ఇంటి పెద్దల సలహాతో పరిష్కరించుకుంటారు. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్వల్పంగా ఆస్తినష్టం సంభవిస్తుంది.
తులారాశి: సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు.
వృశ్చిక రాశి: మిశ్రమ కాలం. ఎవరిని నమ్మి వ్యాపార సంబంధ విషయాలను పంచుకోరాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. న్యాయపరమైన కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనస్సు రాశి: మనో నిబ్బరంతో వ్యవహరించాల్సిన సమయం. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. సమయానుకూలంగా ప్రవర్తించడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయరాదు. పనులను వాయిదా వేయకపోవడం మంచిది.
మకర రాశి: సమయాన్ని వృధా చేయరాదు. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. పిల్లల ప్రవర్తనతో కలత చెందుతారు. ఆప్తులతో వివాదాలు ఏర్పడతాయి. మాటల్లో పొదుపు పాటించడం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
కుంభరాశి: బుద్ధి బలంతో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు.
మీన రాశి: శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన సమయం.