పంచాంగం
తేదీ 02-02-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల చవితి మ. 12.27 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె 4.18 వరకు, తదుపరి రేవతి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనుల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ విజయవంతమవుతారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది . ఇంటా బయటా పై చేయి సాధిస్తారు.
వృషభ రాశి: భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి: మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. అవి తీవ్ర స్థాయికి చేరకుండా జాగ్రత్త పడండి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, పనులు వాయిదా వేయడం మంచిది.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో అప్పులను తీర్చగలుగుతారు. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి: గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
కన్య రాశి: బంధుమిత్రులను కలుసుకొని భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యవహారంలో అధికారుల తోడ్పాటు లభిస్తుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
తులారాశి: ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అందుకు తగిన ఆదాయం అందుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది.
వృశ్చిక రాశి,: మిశ్రమ కాలం. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.
ధనస్సు రాశి: గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్దలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మకర రాశి: ఉద్యోగంలో మార్పు కోరుకునే ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
కుంభరాశి: మిశ్రమకాలం. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కోవాలి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఏకపక్ష నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
మీన రాశి: ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆహార నియమాలు పాటించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.