పంచాంగం
తేదీ 02-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల చవితి ఉ 7.33 వరకు, తదుపరి పంచమి తె 5.35 వరకు, తదుపరి షష్టి
నక్షత్రం: కృత్తిక మ 1.47 వరకు తదుపరి రోహిణి
శుభ సమయం: సా 6.56 నుంచి 7.26 వరకు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల ను సంప్రదించండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయటం మంచిది.
వృషభ రాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మిథున రాశి: కుటుంబ సభ్యుల మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయి. సంయమనంతో పరిష్కరించకపోతే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వడం మంచిది. వ్యాపారులకు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలే మిగులుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.
కర్కాటక రాశి: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
సింహరాశి: నమ్మిన వారే మోసం చేస్తారు. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేయండి. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి.
కన్యారాశి: శ్రమకు తగిన గుర్తింపు లభించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రమేయం లేకపోయినప్పటికీ మాట పడాల్సి రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తులారాశి: మిశ్రమ కాలం. ఉద్యోగులకు విధుల్లో భాగంగా స్థానచలనం జరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.అపరిచితులతో వ్యక్తిగత వివరాలను పంచుకోకపోవడం మంచిది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృశ్చిక రాశి: ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చిక్కు ముడులు తొలగిపోతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు రాశి: కుటుంబంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. ఆప్తుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మకర రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. గిట్టని వారు తప్పుదారి పట్టించాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.
కుంభ రాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ మాటలను ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాటలు పడతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు.
మీనరాశి: కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బందు ప్రీతి ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.