పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం
సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం: సా.5:25
తిథి: మార్గశిర శుద్ధ షష్ఠి మ.3:46 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: శ్రవణం మ.1:46 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: ధృవం సా.6:26 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: తైతుల మ.3:59 వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : సా.5:30 నుండి రా.7:00 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి సా.4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం :మ.12:04 నుండి 1:27 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:56 నుండి 5:44 వరకు
అమృతఘడియలు: రా.2:28 నుండి 3:58 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:42 నుండి మ.12:26 వరకు
ఈరోజు (29-11-2022) రాశి ఫలితాలు
మేషం: వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది.
వృషభం: వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథునం: కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరిగి వలన మానసికంగా స్థిమితం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు కలుగుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
సింహం: సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కన్య: వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల: వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.
వృశ్చికం: వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రుల నుండి నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.
ధనస్సు: బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారమున సమస్యలను పరిష్కారమౌతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
మకరం: వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
కుంభం: వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు.
మీనం: బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.
my normal comment is
Good to see you here, it is me Sariyah Bouchard, I am happy that you came here. My hometown is Micronesia, however now I live in Pereirama. I love this new place. Looking for more details? Well, my job is freight forwarder, from time to time I love to learn more about beachcombing. Do you love music?