Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 29 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం:సా.5:48
తిథి: మాఘశుద్ధ అష్టమి మ.1:58 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: భరణి రా.12:38 ని.వరకు తదుపరి కృత్తిక
యోగం: శుభం.మ.3:47 వరకు తదుపరి శుక్లం
కరణం: బవ మ.2:28 వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం: సా.4:18 నుండి 5:03 వరకు
వర్జ్యం :ఉ.10:04 నుండి 11:41 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 గం. వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:17 నుండి 4:41 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: రా.7:47 నుండి రా.9:24 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:51 వరకు

ఈరోజు (29-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

వృషభం: ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహం: గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

కన్య: బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

తుల: ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

మకరం: ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

కుంభం: దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం: సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...