పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం
సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం : సా.5:20
తిథి: కార్తీక బహుళ దశమి రా.11:19 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ ఏకాదశి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ఉత్తర సా.5:42 వరకు తదుపరి హస్త
కరణం: వనిజ ఉ.11:14 తదుపరి విష్టి
యోగం: ప్రీతి రా. 11:58 వరకు తదుపరి ఆయుష్మాన్
వర్జ్యం: రా.1:54 నుండి 3:28 వరకు
దుర్ముహూర్తం: మ.12:07 నుండి 12:53వరకు తదుపరి మ.2:22 నుండి 3:07 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:27 నుండి 2:50 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:56 నుండి 5:44 వరకు
అమృతఘడియలు: ఉ.10:32 నుండి మ.12;08 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:41 నిమిషము ల నుండి మ.12:26 నిమిషము ల వరకు
ఈ రోజు (29-11-2021) రాశి ఫలితాలు
మేషం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు.
వృషభం: దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంత అంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
మిథునం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కర్కాటకం: రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి.
సింహం: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వనాలు అందుతాయి. ధన పరంగా ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్థులకు అధికారుల నుండి శుభ వార్తలు అందుతాయి.
కన్య: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాలలొ స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.
తుల: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
వృశ్చికం: శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
మకరం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలనే తగిన విశ్రాంతి ఉండదు.
కుంభం: నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మీనం: నిరుద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు విలువైన వస్తులాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు
81699 847278Spot on with this write-up, I genuinely suppose this internet site needs significantly more consideration. probably be once much more to learn way a lot more, thanks for that information. 7621