పంచాంగం
తేదీ 28-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: బహుళ చతుర్దశి రా. 7.29 వరకు, తదుపరి అమావాస్య
నక్షత్రం: పూర్వాషాడ ఉ 8.57 వరకు, తదుపరి ఉత్తరాషాఢ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 10.46 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప. 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: వ్యాపార అభివృద్ధి చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.మనో నిబ్బరంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పని భారం ఎక్కువవుతుంది. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. నమ్మిన వ్యక్తులే మోసం చేసే ప్రమాదం ఉంది.ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలను మొదలు పెట్టవచ్చు.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం. కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. మనో నిబ్బరంతో ఉండాల్సిన సమయం. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఇంటి పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
సింహరాశి: మిశ్రమకాలం. ఏకాగ్రతతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారులకు గతం కంటే విశేషమైన లాభాలు అందుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి: అదృష్ట కాలం. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుతాయి. స్థాన చలన సూచనలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది.
తులారాశి: అదృష్ట కాలం. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. పిల్లల అభివృద్ధి గురించి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి: అనుకూల సమయం. కుటుంబంలో ఆహ్లాదకర తర్వాత వరణం ఉంటుంది. ప్రణాళిక బద్ధంగా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభతో ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఇష్టమైన వ్యక్తులతో విలువైన సమయాన్ని గడుపుతారు.
ధనస్సు రాశి: కష్టకాలం. అనవసర విషయాల్లో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నమ్మిన వారే మోసం చేస్తారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోరాదు. ఆర్థిక లావాదీవీల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు జాగ్రత్తగా నడపాలి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. ప్రియ మిత్రుణ్ణి కోల్పోవాల్సి రావచ్చు.
కుంభరాశి: అనుకూల సమయం. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ఇంటి పెద్దల ప్రశంసలు అందుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి: మిశ్రమ కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి. కొన్ని సమయాల్లో ఓర్పుతో ఉండటం మంచిది.