Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 28-02-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:02 గంటలకు.
తిథి: అమావాస్య ఉ 7.06 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: శతభిషం మ. 3.26 వరకు, తదుపరి పూర్వభాద్ర
శుభ సమయం: సా. 5.03 నుంచి 5.33 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ప. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది.

వృషభ రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. ఆప్తులతో శుభవార్తలు పంచుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మిథున రాశి: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ రుణాలు చేయొద్దు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి: సహనాన్ని పరీక్షించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

సింహరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సామాజిక సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యారాశి: స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండండి. సమయాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం పై నిర్లక్ష్యం పనికిరాదు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

తులారాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు కలత చెందే అవకాశం ఉంది. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో విభేదించాల్సిన రావచ్చు.

వృశ్చిక రాశి: సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కీర్తి, ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సహనంతో వ్యవహరించండి. శుభ ఫలితాలు ఉంటాయి.

ధనస్సు రాశి: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈరోజు కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి: శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కుంభరాశి: అనుకూల సమయం. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. శత్రువులమీద పై చేయి సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి.

మీన రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులను మెప్పించడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు.సహనానికి పరీక్ష పెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంయమనం పాటించండి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా...

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

లీన్ లుక్ తర్వాతే ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్ ప్లాన్ ఇదే

పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించిన అభిమానులకు తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పూర్తిగా లీన్ లుక్ సాధించిన తర్వాతే ‘స్పిరిట్’...