Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 28 జనవరి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా‌.5:49
తిథి: పుష్య బహుళ ఏకాదశి రా.8:41 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము : జ్యేష్ట రా.2:52 వరకు తదుపరి మూల
కరణం: బవ .ఉ.9:51 వరకు తదుపరి భాలవ
యోగం: ధృవం రా.7:41 వరకు తదుపరి వ్యాఘాతం
వర్జ్యం: ఉ.9:44 నుండి 11:13 వరకు
దుర్ముహూర్తం.ఉ.8:51 నుండి 9:35 వరకు తదుపరి మ.12:31 నుండి 1:15 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.8:16 నుండి 9:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి ఉ .6:04 వరకు
అమృతఘడియలు: ‌రా.6:40 నుండి 8:10 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:51 వరకు

ఈరోజు. (28-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం: సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి . చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం: బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.

కన్య: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

తుల: ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.

మకరం: సంతాన ఉద్యోగయత్నాలు సానుకూల మౌతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు.

కుంభం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు . జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మీనం: బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

జ్ఞానవాపి రాజకీయం.! అసలు అక్కడ ఏముంది.?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. జ్ఞానవాపిలో ఏముంది.? మసీదులో శివాలయం వుందా.? శివాలయాన్ని కూల్చేసి మసీదు కట్టబడిందా.? అసలేంటి కథ.? ఇటు సోషల్ మీడియాలో, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇంకో పక్క...

మంత్రుల బస్సు యాత్ర.! ఏపీ రోడ్ల మీదేనా.?

‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మంత్రులట) బస్సు యాత్ర చేయబోతున్నారు. ఎవరైనా బస్సు యాత్రలో, పాదయాత్రలో చేయొచ్చు. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి...

క్రికెట్ కామెంటరీ తెలుగులోనూ వుంది వైఎస్ జగన్ సారూ.!

మాతృ భాషను మృత భాషగా మార్చేసి, పరాయి భాషే మన భాషగా జనం నెత్తిన బలవంతంగా రుద్దితే, దాన్నేమనాలి.? ఈ చర్చ ఇప్పుడు కాదు, చాలాకాలంగా జరుగుతోంది. తమ పిల్లలు ఇంగ్లీషు ష్కూళ్ళకే...

వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం..

రంపచోడవరం వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్కర్ బాబు కారులో మృత‌దేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. కారులో ఉన్న మృతదేశం ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఎమ్మెల్సీ వ‌ద్ద ఐదేళ్లుగా సుబ్రమ‌ణ్యం...

పవన్‌ నల్లగొండ పర్యటన పై టీఆర్‌ఎస్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఉదయం హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చౌటుపల్‌ సమీపంలో ఉండే లక్కారం గ్రామానికి చేరుకుంటారు....

ఎక్కువ చదివినవి

రంకు నేర్చిన రాజకీయం: కాముడెవరు.? రాముడెవరు.?

’రంకు‘ అనే మాటని వాడేందుకు చాలా చాలా అంతర్మధనం చెందాల్సి వస్తోంది. కానీ, తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజవ్కీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని వింత ఇది. నిజానికి,...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల...

విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6న థియేటర్లలో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం...

అంబేద్కర్ జిల్లా వెనుక అంత పెద్ద కథ వుందట.!

కోనసీమ జిల్లా కాస్తా అంబేద్కర్ జిల్లాగా మారబోతోంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఇటీవల వైఎస్ జగన్ సర్కారు మార్చిన విషయం విదితమే. కోనసీమ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక...

వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం..

రంపచోడవరం వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్కర్ బాబు కారులో మృత‌దేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. కారులో ఉన్న మృతదేశం ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఎమ్మెల్సీ వ‌ద్ద ఐదేళ్లుగా సుబ్రమ‌ణ్యం...