పంచాంగం
తేదీ 28-11-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:25 గంటలకు
తిథి: బహుళ త్రయోదశి పూర్తిగా
నక్షత్రం: చిత్త ఉ 7.06 వరకు, తదుపరి స్వాతి
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ప. 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: మ 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం. వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు. దాని వల్ల నష్టాల నుంచి బయటపడతారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ప్రయాణాల్లో భవిష్యత్తుకు సంబంధించి ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటారు.
వృషభ రాశి: ఒత్తిడితో నిండిన రోజు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోరాదు. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దూరం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రమాదం అనుకునే ఏ పనిని చేయకపోవడం మంచిది. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు కలత చెందుతారు.
మిథున రాశి: ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను స్నేహితులతో చర్చించడం మంచిది. ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. వ్యాపారులు చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి.
కర్కాటక రాశి: అదృష్ట కాలం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు పొందుతారు. తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోరాదు.
సింహరాశి: గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్లీ తిరగబెడుతుంది. నిర్లక్ష్యం చేయరాదు. సమస్యలు చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేయాలి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తీవ్రమవుతాయి. నిందలు పడాల్సి రావచ్చు. ప్రమాదం అనుకునే ఏ పనిని చేయకపోవడం మంచిది.
కన్యా రాశి: మిశ్రమ కాలం. మాటలను, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. పనిలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అతిథుల రాక ఆనందాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
తులారాశి: ఒత్తిడితో కూడుకున్న రోజు. గతంలో చేసిన పొరపాటు తెరమీదకు రావడం వల్ల చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న విభేదాలను తొలగించడానికి చర్చలు జరపాలి. బంధువుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అందులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను తల్లిదండ్రులతో చర్చించడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు.
ధనస్సు రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం లో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయి లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కుటుంబంలోని అవివాహితుల వివాహానికి సంబంధించి కొంత గందరగోళం ఏర్పడుతుంది. తండ్రి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
మకర రాశి: కుటుంబ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. కుటుంబంలో ఓ వ్యక్తి విభేదాల కారణంగా ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేనప్పటికీ నిందలు పడాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. సహనంతో వ్యవహరించాలి.
కుంభరాశి: మిశ్రమంగా ఉంటుంది. మంచికి పోయినా చెడు ఎదురవుతుంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రుణాలు చేయడం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: అనుకూల సమయం. చాలాకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మొండి బకాయిలు చేతికి అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ చేతికి అందుతుంది.