Switch to English

రాశి ఫలాలు: సోమవారం 27 జూన్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:37
తిథి: జ్యేష్ఠ బహుళ చతుర్దశి రా.తె.4:45 వరకు తదుపరి జ్యేష్ఠ బహుళ అమావాస్య
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: రోహిణి సా.4:04 వరకు తదుపరి మృగశిర
యోగం: శూల ఉ.7:37 వరకు తదుపరి గండ
కరణం: భద్ర మ.3:45 వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం : మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:46 నుండి 3:34 వరకు
వర్జ్యం : ఉ.7:22 నుండి 9:06 వరకు తదుపరి రా.10:14 నుండి 12:00 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళికా కాలం : మ.1:56 నుండి 3:34 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:12 నుండి 5:00 వరకు
అమృతఘడియలు: మ.12:35 నుండి 2:20 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53 నుండి మ.12:45 వరకు

ఈరోజు (27-06-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ దర్శనాలు మానసికఒత్తిడిని తగ్గిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికం అవుతుంది. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.

వృషభం: నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు.

మిథునం: వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూరప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.

సింహం: వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు.

కన్య: ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. ద్వి స్వభావ ఆలోచనలు ఉంటాయి.

తుల: ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విభేదించినవారే దగ్గరవుతారు.

ధనస్సు: అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యలనుండి చాకచక్యంగా బయట పడతారు వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది.

మకరం: కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మిత్రులనుండి సమస్యలు కలుగుతాయి శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. దైవ భక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది.

కుంభం: ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు ఆరోగ్యం అంతగా అనుకూలించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిరావచ్చు.

మీనం: ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....