Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,480FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 26-02-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:02 గంటలకు.
తిథి: బహుళ త్రయోదశి ఉ. 9.36 వరకు, తదుపరి చతుర్దశి
నక్షత్రం: శ్రవణం సా. 4.39 వరకు తదుపరి ధనిష్ట
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: ప 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప. 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: మనశ్శాంతిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేయండి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ఎవరి విషయాల్లోనూ తల దూర్చకండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు పెరిగినప్పటికీ రుణాలు జోలికి పోవద్దు.

మిథున రాశి: కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం. మంచిది ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. ఆప్తులతో శుభవార్తలను పంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగుల విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

సింహరాశి: వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.

కన్యా రాశి: బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల అలసటకు లోనవుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి రుణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.

తులారాశి: మనోవిచారం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు.ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి.

ధనస్సు రాశి: కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ వాటిని విస్మరించరాదు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి: అదృష్ట కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది.కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. సత్ప్రవర్తనతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

కుంభరాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూరమైన వారు తిరిగి చేరువవుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో పట్టువిడుపులు అవసరం. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. తెలివిగా వ్యవహరించండి.

మీన రాశి: శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మనశ్శాంతిని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

సినిమా

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

రాజకీయం

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

ఎక్కువ చదివినవి

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు తమ సినిమా మెగాస్టార్ చూడాలని ఆయన...

Daily Horoscope: కన్య వారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

మే 11 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో మంచి మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి....