Switch to English

రాశి ఫలాలు: శనివారం 26 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:25
సూర్యాస్తమయం : సా‌.6:01
తిథి: మాఘ బహుళ దశమి ఉ.9:07 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : మూల ఉ.9:17 వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: సిద్ధి రా.7:51 వరకు తదుపరి వ్యతీపాత
కరణం: భధ్ర. ఉ.9:07వరకు
వర్జ్యం: ఉ.7:48 నుండి 9:17వరకు తదుపరిరా. 6:14 నుండి 7:483 వరకు
దుర్ముహూర్తం:ఉ.6:25 నుండి 8:05 వరకు
రాహుకాలం:ఉ.9:00 నుండి 10 :30 వరకు
యమగండం:మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం :ఉ.6:40 నుండి 8:07 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి ఉ.5:52 వరకు
అమృతఘడియలు: రా.తె..3:11 నుండి 4:40 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి 12:52 వరకు

ఈరోజు. (26-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయుట మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిథునం: జీవిత భాగస్వామితో సఖ్యత గా వ్యవహరిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

సింహం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కన్య: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

తుల: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. గృహమునకొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

ధనస్సు: చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నం తో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.

కుంభం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై గృహమును ప్రస్తావన వస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

మీనం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....