పంచాంగం:
తేదీ 25-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: బహుళ ఏకాదశి రా. 6.24 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: జ్యేష్ఠ పూర్తిగా
శుభ సమయం: సా. 4.23 నుంచి 5.20 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ప. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమకాలం. పెద్దవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు చేయని తప్పుకు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభ రాశి: అదృష్ట కాలం. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి, మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి: ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. న్యాయవాద రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అనూహ్యమైన లాభాలు వస్తాయి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వసూలవ్వడం కష్టమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: కొన్ని విషయాల్లో పట్టు విడుపులు అవసరం. వివాదాలకు తావివ్వకండి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల నుంచి అందిన వార్త కలవరపెడుతుంది. మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
కన్య రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి.
తులారాశి: ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కోరుకున్నచోటుకు బదిలీలు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
ధనస్సు రాశి: భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి.
మకర రాశి: మిశ్రమ కాలం. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కొన్ని సమయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి.
కుంభరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శ్రమ పెరుగుతుంది అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి మీది కాని వ్యవహారంలో తల దూర్చకండి. ఉద్యోగులు ఉన్నతాధికారుల అగ్రహానికి గురికావాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. సంయమనం పాటించండి.
మీన రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు దొరుకుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.