Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 24 జూలై 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 24- 07- 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు
తిథి: బహుళ తదియ ఉ. 10.34 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: శతభిషం రా. 10.29 వరకు, తదుపరి పూర్వభాద్ర
దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: ఉ 9.00 నుంచి 10.00 వరకు
రాహుకాలం: ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడతాయి. ఎవరితోనూ విభేదించరాదు. కుటుంబ సమస్యల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఇంటి సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి. చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం నష్టాలకు దారితీస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా నడపాలి.

వృషభ రాశి: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పిల్లల విషయమై అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల సలహాలు విని వ్యాపారులు పెట్టుబడులు పెట్టరాదు. తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున వ్యాపారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఎవరికైనా రుణాలు ఇచ్చినట్లయితే అవి తిరిగి వసూలు అవ్వడం కష్టం.

మిథున రాశి: పని భారం ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి రావచ్చు. నష్ట నివారణ కోసం వ్యాపారంపై దృష్టి సారించాలి. భాగస్వామ్య వ్యాపారులు తమ ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల వివాహ ప్రయత్నంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తవుతుంది.

కర్కాటక రాశి: మిశ్రమకాలం. ఆనందంగా గడుపుతారు. సమయానికి బంధుమిత్రులు ఆర్థిక సాయం చేస్తారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. సహోద్యోగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. వారి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు.

సింహరాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ అనవసర వాగ్వాదాలకు దిగరాదు. సహోద్యోగులతో సఖ్యత పాటించాలి. ఉద్యోగులు పై అధికారులను మెప్పించడానికి కష్టపడాల్సి రావచ్చు. అకారణంగా నిందలు పడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో విభేదం మంచిది కాదు.

కన్యా రాశి: ఈరోజు ఈ రాశి వారు వ్యాపారం పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఇంటి సభ్యుల సలహా తీసుకొని వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం కారణంగా నష్టపోవాల్సి రావచ్చు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం కుటుంబ సభ్యుల్లో ఒకరిని మళ్లీ బాధిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.

తులారాశి: చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో తలెత్తిన సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనం చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోరాదు. కుటుంబ సమస్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది.

ధనస్సు రాశి: సమస్యలతో కూడుకున్న సమయం. మీ ప్రమేయం లేనప్పటికీ నిందలు పడాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరాదు. నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. బాగా ఆలోచించిన తర్వాతే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలి. లేకపోతే అది వసూలు అవ్వడం కష్టం.

మకర రాశి: సమస్యలు చుట్టు ముడతాయి. గిట్టని వారు రెచ్చగొట్టే అవకాశం ఉంది. వారితో వాగ్వాదానికి దిగడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. దూర ప్రయాణాలు చేసేవారు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మరింత ఎక్కువవుతాయి.

కుంభరాశి: ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీన రాశి: శుభకాలం. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.గతంలో చేసిన రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. అతిథుల రాక సంతోషాన్నిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం.

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

తేల్చేసిన ‘పిఠాపురం’ వర్మ.! వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యిందంతే.!

పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో వైసీపీ మొదటి నుంచీ ఓ చిత్రమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారీ వైసీపీకి దిమ్మ...

Bollywood: ‘ఎవరో తెలీని దక్షిణాది హీరోల సినిమాలకు 600కోట్లు’ గేయ రచయిత కామెంట్స్

Bollywood: ‘ముక్కూ, మొహం తెలీని దక్షిణాది హీరో సినిమాలకు ఇక్కడ రూ.600-700కోట్లు వస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది..? ఏటా కొత్త హిందీ సినిమాలు వస్తున్నా మనవాళ్లని అలరించలేకపోతున్నాయి. కారణమేంట’ని ప్రముఖ హిందీ గీత...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

Priyadarshi: ‘అందుకే ‘గేమ్ చేంజర్’లో నటించా.. కానీ’ నటుడు ప్రియదర్శి ఆవేదన

Priyadarshi: ‘శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికైతే తీరింది కానీ.. నిరుత్సాహమే మిగిలింద’న్నారు నటుడు ప్రియదర్శి. రామ్ జగదీశ్ దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా మార్చి...