పంచాంగం
తేదీ 24-01-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: బహుళ దశమి తె 4.53 వరకు, తదుపరి ఏకాదశి.
నక్షత్రం: అనురాధ తె 5.34 వరకు తదుపరి జేష్ఠ.
శుభ సమయం: సా. 4.23 నుంచి 5.20 వరకు
దుర్ముహూర్తం: ప 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ.12.24 నుంచి మ. 1.12 వరకు
రాహుకాలం: ప. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప. 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సమస్యలను చాకచక్యంగా తీర్చగలుగుతారు. అనవసర ఖర్చుల వల్ల స్వల్పంగా ఇబ్బంది పడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి: ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. రాజకీయ రంగాల వారు అదనపు బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. స్వల్పంగా అనారోగ్యానికి గురవుతారు.
మిథున రాశి: నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆస్తికి సంబంధించిన రాబడి వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయం అవుతుంది.
కర్కాటక రాశి: ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
సింహరాశి: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఆప్తుల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్యా రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. గొప్ప వారితో పరిచయం అవుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
తులారాశి: అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం.
వృశ్చిక రాశి: సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ముందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి: ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఇష్టమైన వ్యక్తులతో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.
కుంభరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇవ్వండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
మీన రాశి: కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన వారితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.