Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 24 మే 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: సా.6:27
తిథి: వైశాఖ బహుళ నవమి మ.3:44 వరకు తదుపరి వైశాఖ బహుళ దశమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: పూర్వాభాద్ర.రా.2:03 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: విష్కంభం తె.3:31 వరకు తదుపరి ప్రీతి
కరణం: గరజి. మ.2:37 వరకు తదుపరి వనిజ
వర్జ్యం:ఉ.9:09 నుండి 10:40 వరకు
దుర్ముహూర్తం:8:24 నుండి 9:12 వరకు తదుపరి రాత్రి.10:46 నుండి 11: 36 వరకు
రాహుకాలం: ఉ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : మ.12:13 నుండి 1:49 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి 4:57 వరకు
అమృతఘడియలు: రా.6:15 నుండి రా. 7:49 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:38 వరకు

ఈరోజు (24-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

వృషభం: మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిథునం: ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

కర్కాటకం: కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం: గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

కన్య: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం: వ్యాపారాలు నిదానంగా సాగుతాయి , నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

ధనస్సు: వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు.

మకరం: కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

కుంభం: నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

ఎక్కువ చదివినవి

గోరంట్ల మాధవ్‌ని వెనకేసుకొచ్చిన మంత్రి రోజా.!

అరరె.! ఎంత మాట అనేస్తిరి.? నేరం నిరూపితం కాకుండానే అనవసరమైన ఆరోపణలు చేయడమేంటి.? అంటూ మంత్రి రోజా ‘సుద్ద పూస కబుర్లు’ చెబుతున్నారు. ఏంటో, ఈ రాజకీయం.! ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం...

నా సెక్స్ లైఫ్ అంత ఆసక్తికరంగా ఉండదు: కాఫీ విత్ కరణ్ గురించి తాప్సి పన్ను

ఇండియాలోనే అతిపెద్ద టాక్ షో గా కాఫీ విత్ కరణ్ గురించి చెప్పుకోవచ్చు. 2004లో మొదలైన ఈ షో ఇప్పుడు ఏడో సీజన్ లో ఉంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ పూర్తవ్వగా ఆరో...

బింబిసార దర్శకుడు ముందు నలుగురు హీరోలను ట్రై చేసాడట!

బింబిసారతో నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్బ్ హిట్ ను అందించాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మొదటి వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రను...

రాశి ఫలాలు: మంగళవారం 09 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ద్వాదశి మ.2:56 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: మూల ఉ.10:21 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం:...