పంచాంగం
తేదీ 23-10-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు.
తిథి: బహుళ షష్ఠి ఉ 6.33 వరకు, తదుపరి సప్తమి తె 5.34 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: ఆరుద్ర ఉ 11.21 వరకు, తదుపరి పునర్వసు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: ఉ 9.00 నుంచి 10.00 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. వారితో మృదువుగా సంభాషించడం వల్ల పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి: చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు తీవ్రంగా శ్రమించి లాభాలు అందుకుంటారు.
మిథున రాశి: మీ మీ రంగాల్లో శ్రద్ధ పెట్టి పని చేయాలి. లేకపోతే పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. గతంలో బాధించిన అనారోగ్యం మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉపాధ్యాయులతో చర్చించాలి. గిట్టని వారు మీ పనికి అడ్డంకులు సృష్టిస్తారు. అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి: బద్దకాన్ని వదిలి ముందుకు సాగకపోతే సమస్యలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలను సామరస్యంగా చర్చించుకోవాలి. పెద్దల సమక్షంలో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరుల వాహనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
సింహరాశి: ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి తీసుకున్న వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులకు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.
కన్యా రాశి: అధిక పని భారం ఒత్తిడిని కలిగిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తులారాశి: నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. సొంతింటి కల నెరవేరుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మీ ప్రవర్తనతో కలత చెందుతారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. మీ ప్రవర్తన తో పిల్లలు నొచ్చుకునే ప్రమాదం ఉంది. ఆప్తులతో వైరం పెరుగుతుంది.
వృశ్చిక రాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో చేసిన పొరపాటు కారణంగా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అపరిచిత వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆప్తుల సహాయంతో చిరకాల కోరిక నెరవేర్చుకుంటారు.
ధనస్సు రాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని అరువుగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎటువంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోరాదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.
మకర రాశి: ముఖ్యమైన పని కోసం ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చూపించే ప్రేమను ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదముంది. జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆప్తుల మాటలకు కలత చెందుతారు.
కుంభరాశి: చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు. చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీన రాశి: కుటుంబ సమస్యలతో కలత చెందుతారు. పనిమీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతాయి. ఫలితంగా నిందలు పడాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరి మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి.
Howdy! Woul yoou miund if I share youur blog with my ffacebook group?
There’s a lot of fols that I think would reaply apprecioate
your content. Please let mme know. Thanks
Hello there! This post couod nnot bbe written anyy better!
Reading thrrough this pst reminds mee of mmy previous roommate!
He alsays ket talkiing anout this. I am going too forward
this aryicle tto him. Farly certain hhe will havee a very goood read.
Manny thanks foor sharing!