పంచాంగం
తేదీ 23- 07- 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు.
తిథి: బహుళ విదియ ప 12.45 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: ధనిష్ట రా.11.55 వరకు, తదుపరి శతభిషం
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు.
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: సవాళ్లతో కూడుకున్న రోజు. ఒడిదుడుకుల కారణంగా వ్యాపారంలో నష్టపోవాల్సి రావచ్చు. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోరాదు. న్యాయపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఆలోచనత్మకంగా వ్యవహరించాలి. ఎవరితోనూ విభేదించరాదు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా అంతగా కలిసి రావు.
వృషభ రాశి: గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు గణనీయమైన లాభాలు అందుతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. సహనం కోల్పోకుండా వ్యవహరించాలి. బయట వ్యక్తులకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోరాదు. విద్యార్థులు ఒత్తిడిని జయించలేక సతమతమవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు లావాదేవీలకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
కర్కాటక రాశి: శ్రమతో కూడిన సమయం. వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు నిర్లక్ష్య ధోరణిని వదిలివేయాలి. పై అధికారులతో వాగ్వాదానికి దిగకూడదు. ప్రతికూల వాతావరణం ఉంటుంది. పని భారం కారణంగా స్వల్ప అనారోగ్యానికి గురవుతారు.
సింహరాశి: ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. జీవిత భాగస్వామి తో వాగ్వాదానికి దిగుతారు. చర్చల ద్వారా మనస్పర్ధలను పోగొట్టుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చర్చించి ఏ పనినైనా మొదలుపెట్టడం మంచిది. వాతావరణ మార్పుల కారణంగా స్వల్ప అనారోగ్యానికి గురికావాల్సి రావచ్చు.
కన్య రాశి: మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ లాభపడతారు. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. గిట్టనివారిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
తులారాశి: వ్యాపారంలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోయి లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి సరైన సమయం. అతిథుల రాకతో ఆనందపడతారు. తోబుట్టువుల సహాయం అందుతుంది. పని భారం కాస్త ఎక్కువగా ఉండటంవల్ల స్వల్పంగా అనారోగ్యానికి గురవుతారు.
వృశ్చిక రాశి: మెరుగైన సమయం. వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసుల్లో పైచేయి సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారులు ముఖ్యమైన ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మొండి బకాయిలు చేతికందుతాయి.
ధనస్సు రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మకర రాశి: మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారులు మెరుగైన లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి అనువైన సమయం. అయితే అందుకు తగిన పత్రాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. అనారోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేయరాదు.
కుంభరాశి: ఈరోజు ఈ రాశి వారు పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి తీవ్రమౌతుంది. కుటుంబ వివాదాలను చక్కదిద్దే దిశగా ప్రయత్నాలు జరపాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది.
మీన రాశి: అదృష్ట కాలం. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలి.
