పంచాంగం
తేదీ 23-01-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: బహుళ నవమి మ. 3.18 వరకు తదుపరి దశమి
నక్షత్రం: విశాఖ తె 3.07 వరకు తదుపరి అనురాధ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ.2.46 నుంచి మ. 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ప. 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒక విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి. విలాసవంతమైన వస్తువుల జోలికి పోరాదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మిధున రాశి: బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారం లాభాల బాట పడుతుంది. భాగస్వామ్యం వ్యాపారాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
కర్కాటక రాశి: ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేయరాదు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి.
సింహరాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు.
కన్యా రాశి: మిశ్రమకాలం. వివాదాలకు దూరంగా ఉండండి. ఉన్నతాధికారులతో మృదువుగా సంభాషించండి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తులారాశి: అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు.
వృశ్చిక రాశి: కుటుంబంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారితో కొన్ని విషయాల్లో విభేదించాల్సి రావచ్చు. కొందరి మాటలు బాధ కలిగిస్తాయి. ఆప్తుల నుంచి అందిన వార్త ఆందోళన కలిగిస్తుంది. అదనపు ఖర్చుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది.
ధనస్సు రాశి: అనుకూల సమయం. సమయానుకూలంగా వ్యవహరించండి. అదనపు ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం ఉంటుంది. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగాల వారు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు.
మకర రాశి: కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో వివాహాల ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు చేపట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
కుంభరాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఉత్తమ పనితీరును కనబరిచి అందరి ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీన రాశి: ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి.