Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 23 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 23-02-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:02 గంటలకు.
తిథి: బహుళ దశమి ఉ 10.27 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం: మూల ప. 3.47 వరకు, తదుపరి పూర్వాషాఢ
శుభ సమయం: ఉ 7.24 నుంచి 8.15 వరకు, తిరిగి ఉ 10.30 నుంచి 11.06 వరకు
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప. 12 00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కష్టకాలం. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీ మంచి స్వభావాన్ని ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఫలితంగా ఏ పనీ పూర్తికాదు. బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేయకండి. గురు ప్రయాణాలను వాయిదా వేసుకోండి.

వృషభ రాశి: కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇంటి పెద్దల సాయంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆప్తులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ఈరోజు మొదలు పెట్టొచ్చు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

కర్కాటక రాశి: ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాలు పనికిరావు. వ్యాపార భాగస్వామి తో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తుతాయి. ఫలితంగా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహరాశి: మిశ్రమకాలం. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. వివాదాలకు తావివ్వకండి. ఆర్థిక సమస్యలు తలెత్తినప్పటికీ రుణాలు చేయకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

కన్యారాశి: ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆస్తి సంబంధ విషయమై ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ కాస్త ఎక్కువ అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.

తులారాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ఆలోచనలు ఒత్తిడిని పెంచుతాయి. వివాదాలకు చోటు ఇవ్వకండి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టేటప్పుడు ఆప్తుల సలహా తీసుకోండి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను వాయిదా వేయండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.

వృశ్చిక రాశి: అనుకూల సమయం. తల్లిదండ్రుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ధనస్సు రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రత్యర్థులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు మనోబలంతో వాటిని ఎదుర్కోవాలి. ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకండి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. అనవసర ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలనువాయిదా వేయడం మంచిది.

మకర రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు విశేషమైన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభరాశి: ప్రయాణాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలంతో వాటిని ఎదుర్కోవాలి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. అవసరానికి తోబుట్టువుల సాయం అందుతుంది. అనవసర ఆలోచనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. కొద్దిపాటి ఆస్తి నష్టం సంభవిస్తుంది.

మీనరాశి: ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. ఇంటి పెద్దల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆందోళన చెందుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. వ్యాపారులు స్వల్ప నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.

సినిమా

Meenakshi Seshadri: చిరంజీవి-విశ్వనాధ్..’ఆపద్భాంధవుడు’ జ్ఞాపకాలు పంచుకున్న మీనాక్షీ శేషాద్రి

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

రాజకీయం

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు… ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

ఏప్రిల్ 15 , 2026 బుధవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో మార్పులు కనిపించవచ్చు....

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...