Switch to English

రాశి ఫలాలు: గురువారం 23 జూన్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:37
తిథి: జ్యేష్ఠ శుద్ధ దశమి రా.12:36 వరకు తదుపరి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: రేవతి ఉ.10:14 వరకు తదుపరి అశ్వని
యోగం: శోభన ఉ.9:14 వరకు తదుపరి అతిగండ
కరణం: వనిజ మ.12:34 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: తె.345 నుండి 5:29 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:00 నుండి 10:48 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:02 నుండి 10:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:11 నుండి 4:59 వరకు
అమృతఘడియలు: ఉ.7:49 నుండి 9:26 వరకు రా.తె.3:34 నుండి 5:13 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:52 నుండి మ.12:44 వరకు

ఈరోజు (23-06-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

వృషభం: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు.

మిథునం: చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం: ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

సింహం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి.ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్ధిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

వృశ్చికం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబమున కొందరి మాటల వలన మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

మకరం: బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు పొందుతారు.

కుంభం: కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం: చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...