పంచాంగం
తేదీ 22-10-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: బహుళ పంచమి ఉ.7.35 వరకు, తదుపరి షష్ఠి.
నక్షత్రం: మృగశిర ఉ 11.38 వరకు, తదుపరి ఆరుద్ర.
దుర్ముహూర్తం: ఉ 8.21 నుంచి 9.12 వరకు, తిరిగి రా 10.48 నుంచి 11.36 వరకు.
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు.
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు.
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ గమనిస్తూ ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
వృషభ రాశి: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబెడుతుంది. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారుల ఆదాయం సాధారణంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
మిథున రాశి: సత్ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు. కీలక సమయాల్లో బుద్ధిబలం పనిచేస్తుంది. వ్యాపారుల ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి సాయంతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు అదనపు ఆదాయం పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.
సింహరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల సాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు.
కన్యారాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని, సమస్యలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. కొన్ని ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించల్సి వస్తుంది.
తులారాశి: ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాలాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల సలహాలు విని వ్యాపారులు పెట్టుబడులు పెట్టరాదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి: సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు ఊహించని ఆదాయం అందుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ధనస్సు రాశి: శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. పనిపై ఏకాగ్రత పెట్టలేకపోవడం వల్ల అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అకారణంగా నిందలు పడతారు. కుటుంబ సమస్యలు కలవరపెడతాయి.కంటికి సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
మకర రాశి: ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపార భాగస్వామి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీలక సమయాల్లో బంధుమిత్రులు ఆదుకుంటారు. ఇంటి పెద్దల సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి.
కుంభరాశి: అదృష్ట కాలం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులో విజయం సాధిస్తారు. జీవితం మలుపు తిరిగే సంఘటన చోటు చేసుకుంటుంది. మెరుగైన ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా ఉంటాయి. మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
మీన రాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందరాదు. ఒత్తిడికి గురవకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
I woll immediately seikze you rss as I can noot to finjd your e-mail subsdcription link oor newsletter service.
Do you’ve any? Kinly permkt mee reconise in order
that I could subscribe. Thanks.