Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,195FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 22- 06-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు.
తిథి: పూర్ణిమ ఉ. 6.18 వరకు, తదుపరి పాడ్యమి తె. 5.18 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: మూల సా.6.44 వరకు తదుపరి పూర్వాషాడ
దుర్ముహూర్తం: ఉ. 6.00 నుంచి 7.36 వరకు
శుభ సమయం: ఉ 10.00 నుంచి 10.30 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: చుట్టూ ఉన్నవారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. కీలక సమయాల్లో తోబుట్టువుల సహకారం అందుతుంది. నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంటుంది. పారదర్శకంగా వ్యవహరించాలి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు తల్లితండ్రుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశి: అధిక పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవుతారు. కీలక సమయాల్లో సహోద్యోగుల మద్దతు ఉంటుంది. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. గతంలో జరిగిన పొరపాటు నుంచి పాఠం నేర్చుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడతారు.

కర్కాటక రాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారులు ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించుకోవాలి. ఇతరులతో ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది.

సింహరాశి: పాత స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్ అందుతుంది.

కన్యా రాశి: వ్యాపారులు తెలివిగా వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఒత్తిడి తీసుకోకుండా ఉపాధ్యాయుల సలహాలు పాటించడం మంచిది.

తులారాశి: కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పనిచేయడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అది వివాదానికి దారితీస్తుంది. జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే చర్చించుకోవడం మంచిది. చెప్పుడు మాటలకు తావివ్వకపోవడం మంచిది.

వృశ్చిక రాశి: కొత్త ఉద్యోగం చేయాలని ఆసక్తితో ఉంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు ఆ ఆలోచన వాయిదా వేయడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రయత్నం విరమించుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు రాశి: గతంలో చేసిన పొరపాట్లు బయటపడటం వల్ల పై అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఇంటి పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులకు గణనీయమైన ఆదాయం అందుతుంది.

మకర రాశి: మీ ప్రమేయం లేకపోయినా వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. గతంలో చేసిన ఒక పొరపాటు బయటపడే అవకాశం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంటారు.

కుంభరాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు గతం కంటే మెరుగైన ఆదాయాన్ని పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

మీన రాశి: అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనుల్లో జరిగిన పొరపాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. గిట్టని వారు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ రంగాల్లో ఉండేవారు ఎవరిని అతిగా నమ్మకపోవడం మంచిది.

సినిమా

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా,...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

రాజకీయం

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను జనవరి 16న విడుదల...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’: మెగాస్టార్ మ్యాజిక్ మళ్లీ రిపీట్

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంలలో సినిమా గురించి వస్తున్న...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

Daily Horoscope: ఆర్థిక లాభాలు మేషానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కన్యకు

జనవరి 12, 2026 సోమవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో లాభ సూచనలు కనిపిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....