పంచాంగం
తేదీ 22- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి ప.2.35 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: శ్రవణం రా.12.45 వరకు, తదుపరి ధనిష్ట
దుర్ముహూర్తం: ప. 12.45 నుంచి 1.12 వరకు, తిరిగి ప. 2.46 నుంచి 3.34 వరకు.
శుభ సమయం: ఏమీ లేవు.
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు.
యమగండం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకునే ఈ రాశి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. అనవసర విషయాలు తల దూర్చడం మంచిది కాదు. అది పొరపాట్లకు దారి తీయొచ్చు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
వృషభ రాశి: ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో మార్పు కోరుకోవాలనుకునే ఈ రాశి వారికి ఫలితం ఉంటుంది. పని భారం ఎక్కువవుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఏదైనా సమస్య తలెత్తితే వైద్యున్ని సంప్రదించడం మంచిది. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహా కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది.
మిథున రాశి: న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నవారు బయటపడతారు. ఉద్యోగులకు గుర్తింపు ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. కుటుంబ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి వివాదాల్లోనూ తల దూర్చరాదు. ప్రణాళిక అబద్ధంగా పనులు పూర్తి చేయగలుగుతారు. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచిది.
సింహరాశి: అనుకూల సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు.
కన్యా రాశి: ఈరోజు ఈ రాశి వారు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఆదాయం, ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. పొదుపు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి: పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఆలోచనను ఆచరణలో పెట్టొచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రమేయంతో ఇంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రుణాలు చేయడం మంచిది కాదు.
వృశ్చిక రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారి పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇంటి పెద్దలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి: సామాజిక రంగాల్లో పనిచేసే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పని భారం ఎక్కువవుతుంది. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రత్యర్ధులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉండే వారికి ప్రమోషన్లు అందుతాయి. పై అధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించరాదు.
మకర రాశి: ఈరోజు మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను ఆచరణలో పెట్టడానికి సరైన సమయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు చేతికందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపార ప్రణాళికలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కుంభరాశి: చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు ఖర్చులను పెంచుతాయి. మీ గౌరవాన్ని పెంచుకునే శుభకార్యాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే వారికి సరైన సమయం. ముఖ్యమైన పనిని వాయిదా వేయరాదు.
మీన రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో స్నేహితులతో విభేదించాల్సి రావచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.