Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 22 జనవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 22-01-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ అష్టమి మ. 2.17 వరకు తదుపరి నవమి
నక్షత్రం: స్వాతి రా. 1.03 వరకు తదుపరి విశాఖ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప. 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయండి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరిచినప్పటికీ ఉన్నతాధికారులు సంతృప్తి చెందరు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

వృషభ రాశి: భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఒంటరిగా ప్రయాణం చేయకండి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక నష్టం జరుగుతుంది.

మిథున రాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో కొద్దిపాటి విభేదాలు తలెత్తుతాయి, ఆ సమయంలో సంయమనం పాటించండి. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది.

కర్కాటక రాశి: సాధారణ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆస్తి విషయంలో కొద్దిపాటి విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల్లో కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

సింహరాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

కన్య రాశి: ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమౌతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం బారిన పడతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి.

తులారాశి: వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. న్యాయవాద రంగాల వారికి గొప్ప అవకాశాలు అందుతాయి. రాజకీయ రంగాల వారు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.

వృశ్చిక రాశి: వ్యాపారులు చిరకాల ప్రాజెక్టును దక్కించుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ప్రతిభతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.

ధనస్సు రాశి: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకర రాశి: మిశ్రమ కాలం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభరాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆదాయ అభివృద్ధిపై దృష్టి పెడతారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీన రాశి: మిశ్రమకాలం కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తుతాయి. ఇంటి సభ్యుల్లో కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలతో పాటు స్థాన చలనం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత అక్కడే మరో...