పంచాంగం
తేదీ 23-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు.
తిథి: బహుళ దశమి ఉ 11.50 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం: ధనిష్ట ఉ 7.38 వరకు, తదుపరి శతభిషం
శుభ సమయం: ఉ 9.54 నుంచి 10.18 వరకు, తిరిగి సా 4.14 నుంచి 5.18 వరకు
దుర్ముహూర్తం: ప. 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ ప్రమేయం లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో మాటలు పడాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కీలక పనులను వాయిదా వేయకండి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. అరవు తెచ్చుకున్న వాహనాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. రాజకీయాల రంగాల వారికి ఉన్నత పదవులు అందుతాయి. ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం అందుతుంది.
మిథున రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు ఏర్పడతాయి. సంయమనం పాటించి వాటిని పరిష్కరించుకోండి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: శత్రువులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకండి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. రుణ ప్రయత్నాలు వికటిస్తాయి. మీది కాని వ్యవహారంలో తల దూర్చకండి. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఇతరులకు అప్పజెప్పకండి.
సింహరాశి: అరువు తెచ్చుకున్న వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోండి. జీవిత భాగస్వామితో సామరస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మనస్పర్ధలు తొలగిపోతాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇంటి పెద్దల సాయంతో పూర్తి చేస్తారు.
కన్యా రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.
తులారాశి: చేపట్టిన పనుల్లో ఆశీస్సుల ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ ఒక వ్యవహారంలో నిందలు పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ప్రయాణాలను, పనులను వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి: ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెడుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో విభేదించాల్సి వస్తుంది. సంయమనం పాటించండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు తావివ్వకండి.
ధనుస్సు రాశి: ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయటం మంచిది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఇతరులకు అప్పజప్పకండి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనించుకోండి. స్థిరాస్తి సంబంధ ఒప్పంద పత్రాలలో జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య అకారణ వైరం తలెత్తుతుంది. సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్త పడండి.
మకర రాశి: ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన గృహ యోగం ఉంది.
కుంభరాశి: కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పని ప్రదేశంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆప్తులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
మీన రాశి: ముఖ్యమైన పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సాయంతో ఒక సమస్య నుంచి బయట పడతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టబడిన ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి.