పంచాంగం
తేదీ 22-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు.
తిథి: బహుళ నవమి మ 1.03 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: శ్రవణం ఉ 8.03 వరకు, తదుపరి ధనిష్ట
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప.08.24 నుంచి 9.12 వరకు, తదుపరి రా 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. గత కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథున రాశి: ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.
కర్కాటక రాశి: అదృష్ట కాలం. ఉద్యోగులకు కోరుకున్న చోటికి స్థానచలనం లభిస్తుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతింటి కల నెరవేరుతుంది. విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహరాశి: సమయానుకూలంగా వ్యవహరించండి. ఎవరినీ నమ్మి ఆర్థిక వ్యవహారాలు అప్పజెప్పకండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. చెయ్యని తప్పుకు మాటలు పడతారు.
కన్యారాశి: మిశ్రమకాలం. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. నమ్మినవారే మోసం చేస్తారు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. జీవిత భాగస్వామితో తీవ్ర మనస్పర్ధలు ఏర్పడతాయి. సంయమనం పాటించి సమస్యను పరిష్కరించుకోకపోతే బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది.
తులారాశి: చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఉద్యోగుల విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చిక రాశి: వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడులు పడతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి.
ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరిని నమ్మి ఆర్థిక వ్యవహారాలు అప్ప చెప్పకండి. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచండి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
మకర రాశి: చేపట్టిన పనులలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులకు అనుకూల సమయం.
కుంభరాశి: మిశ్రమ కాలం. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి వచ్చినప్పుడు సంయమనం పాటించండి.
మీన రాశి: శ్రమ పెరుగుతుంది. బాధ్యతలు ఎక్కువవుతాయి. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.