Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 21 అక్టోబర్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,057FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 21-10-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: బహుళ చవితి ఉ 9.01 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: రోహిణి ప. 12.19 వరకు, తదుపరి మృగశిర
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి 2.46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: ఉ 6.15 నుంచి 07.00 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడతాయి. ఎవరితోనూ విభేదించరాదు. కుటుంబ సమస్యల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఇంటి సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి. చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం నష్టాలకు దారితీస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా నడపాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

వృషభ రాశి: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పిల్లల విషయమై అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల సలహాలు విని వ్యాపారులు పెట్టుబడులు పెట్టరాదు. తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున వ్యాపారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఎవరికైనా రుణాలు ఇచ్చినట్లయితే అవి తిరిగి వసూలు అవ్వడం కష్టం.

మిథున రాశి: పని భారం ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి రావచ్చు. నష్ట నివారణ కోసం వ్యాపారంపై దృష్టి సారించాలి. భాగస్వామ్య వ్యాపారులు తమ ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల వివాహ ప్రయత్నంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తవుతుంది.

కర్కాటక రాశి: మిశ్రమకాలం. ఆనందంగా గడుపుతారు. సమయానికి బంధుమిత్రులు ఆర్థిక సాయం చేస్తారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. సహోద్యోగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. వారి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు.

సింహరాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ అనవసర వాగ్వాదాలకు దిగరాదు. సహోద్యోగులతో సఖ్యత పాటించాలి. ఉద్యోగులు పై అధికారులను మెప్పించడానికి కష్టపడాల్సి రావచ్చు. అకారణంగా నిందలు పడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో విభేదం మంచిది కాదు.

కన్యా రాశి: ఈరోజు ఈ రాశి వారు వ్యాపారం పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఇంటి సభ్యుల సలహా తీసుకొని వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం కారణంగా నష్టపోవాల్సి రావచ్చు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం కుటుంబ సభ్యుల్లో ఒకరిని మళ్లీ బాధిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.

తులారాశి: చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో తలెత్తిన సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనం చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఎవరినీ అతిగా నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోరాదు. కుటుంబ సమస్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. స్వల్ప ఆస్తి నష్టం సంభవిస్తుంది.కుటుంబ సభ్యులకు అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది.

ధనస్సు రాశి: సమస్యలతో కూడుకున్న సమయం. మీ ప్రమేయం లేనప్పటికీ నిందలు పడాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరాదు. నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. బాగా ఆలోచించిన తర్వాతే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలి.

మకర రాశి: సమస్యలు చుట్టు ముడతాయి. గిట్టని వారు రెచ్చగొట్టే అవకాశం ఉంది. వారితో వాగ్వాదానికి దిగడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. దూర ప్రయాణాలు చేసేవారు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మరింత ఎక్కువవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.

కుంభరాశి: ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ రంగాల వారు ఉన్నత పదవులను చేజిక్కించుకుంటారు.

మీన రాశి: శుభకాలం. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.గతంలో చేసిన రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. అతిథుల రాక సంతోషాన్నిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naga Chaitanya-Sobhita: ‘చైతన్య భర్త కావడం అదృష్టం’ పెళ్లి ఫొటోలు షేర్...

Naga Chaitanya-Sobhita: అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటివలే వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం...

Manchu Manoj: కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్..

Manchu Manoj: మంచు మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని ఈరోజు ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే.....

మంచు రగడ: కొట్టుకున్న తండ్రీ-కొడుకు.? కానీ, తూచ్ అనేశారా.!?

తండ్రీ - కొడుకు మధ్య కొట్లాట జరిగిందట. గాయాలతో పోలీసుల్ని ఆశ్రయించాడట కొడుకు. తండ్రి కొట్టాడన్నది కొడుకు ఆరోపణ అట. కాదు కాదు, కొడుకే తండ్రిని...

A.R.Rahman: సినిమాలకు రెహమాన్ విరామం..! ఆయన కుమార్తె ఏమన్నారంటే..

A.R.Rahman: ఏ.ఆర్.రెహమాన్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్నాళ్లు ఆయన కెరీర్ కు విరామం ఇస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో...

Manchu Family: మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవలు..! స్పందించిన మంచు ఫ్యామిలీ

Manchu Family: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగాయని ఉదయం నుంచీ వార్తలు హల్ చల్ చేశాయి. తండ్రి మంచు మోహన్...

రాజకీయం

జగనన్న షిక్కీ.. ఆ ఛండాలం లేదు: విద్యార్థుల తల్లిదండ్రుల సంతోషం.!

జగనన్న షిక్కీ.. జగనన్న గోరుముద్ద.. జగనన్న మట్టి.. జగనన్న మశానం.. ఇదీ వైసీపీ హయాంలో నడిచిన వ్యవహారం.. ఇప్పుడవన్నీ లేవు.. అంటూ ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్దిదారులు, అందునా విద్యార్థుల తల్లిదండ్రులు...

హీరోయిజం అంటే ఇదీ: జనసేనాని పవన్ కళ్యాణ్.!

హీరోలంటే, తెరపై ఫైట్లు చేసేవాళ్ళు కాదు.. సినిమా హీరోగానే చెబుతున్నాను నేను.! నా దృష్టిలో నా తల్లి హీరో. నా తండ్రి హీరో. చదువు చెప్పే గురువు హీరో.! ఇదీ జనసేన అధినేత...

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ...

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.....

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

ఎక్కువ చదివినవి

BalaKrishna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందా..!? క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే విషయం తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం కూడా...

మన స్కూలు. మన కడప.! పవన్ కళ్యాణ్ దాతృత్వమిదీ.!

కడప జిల్లాలో జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో...

Manchu Family: మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవలు..! స్పందించిన మంచు ఫ్యామిలీ

Manchu Family: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగాయని ఉదయం నుంచీ వార్తలు హల్ చల్ చేశాయి. తండ్రి మంచు మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి...

కాకినాడ పోర్టు వాటాల కేసు.. జగన్ కు మరో భారీ దెబ్బ..!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టు హాట్ టాపిక్ అయింది. అదేంటో గానీ పవన్ ఏం చేసినా సరే దాని చుట్టూ చాలా వ్యవహారాలు బయట పడుతున్నాయి. ఇప్పుడు ఆయన కాకినాడ పోర్టుకు...

Allu Arjun : పుష్ప రాజ్‌కి మరో జాతీయ అవార్డ్‌ పక్కా..!

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్‌కి...