Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 మార్చి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 21-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ సప్తమి రా. 11.50 వరకు
నక్షత్రం: జ్యేష్ఠ రా. 9.49 వరకు, తదుపరి మూల
శుభ సమయం: ఉ 9.45 నుంచి 10.18 వరకు, తిరిగి సా. 4.48 నుంచి 5.00 వరకు
దుర్ముహూర్తం: ప 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి ప. 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ప 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

వృషభ రాశి: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. వారికి సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నించండి.

మిధున రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ముఖ్యమైన పనికోసం ఎవరిమీద ఆధారపడరాదు. పనుల్లో జాప్యం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఒక విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టేందుకు ఇది అనుకూల సమయం కాదు.

కర్కాటక రాశి: అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారులు తీవ్రంగా శ్రమించి స్వల్ప లాభాలను పొందగలుగుతారు. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

సింహరాశి: మీ ప్రతిభతో ప్రశంసలు దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

కన్యా రాశి: కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. ఇతరులతో సంభాషించేటప్పుడు సంయమనం తో మాట్లాడటం మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు కొనసాగుతాయి. సహనానికి పరీక్ష పెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

తులారాశి: ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాద వాతావరణం ఉంటుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు గణనీయమైన లాభాలను పొందగలుగుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆప్తుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు రాశి: భయభ్రాంతులకు గురిచేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రమాదం అనుకునే ఏ పని చేయరాదు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. వివాదాలకు దూరంగా ఉండండి ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకర రాశి: కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. సొంతింటి కల నెరవేరేందుకు తొలి అడుగు పడుతుంది. ఆర్థిక సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

కుంభరాశి: మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ధనవ్యయం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. మాటల్లో సంయమనం పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు కొనసాగుతాయి.

మీన రాశి: చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఇంటా బయట పై చేయి సాధిస్తారు. అందర్నీ కలుపుకొని పోవడం ద్వారా ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది.

సినిమా

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

హీరో రామ్ తో డేటింగ్ పై భాగ్య శ్రీ క్లారిటీ..

యంగ్ హీరో రామ్ హీరోయిన్ భాగ్య శ్రీతో డేటింగ్ లో ఉన్నాడంటూ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఇవే సాక్ష్యాలు అంటూ పెద్ద హంగామా చేశారు...

ఓదెల-2.. తమన్నాపై భారం వేసి ఊరుకున్నారా..?

ఓదెల-2.. సినిమాకు చేసిన పబ్లిసిటీ పాన్ ఇండియా లెవల్లో ఉంది. కానీ వసూళ్లు చూస్తే మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో టీజర్.. ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్...

జనసేన సభ్యత్వంతో, జనసేన ‘కుటుంబం’లోకి.!

రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడం కొత్తేమీ కాదు. కొన్ని రాజకీయ పార్టీలకు సభ్యత్వంతో పని వుండదు. అలాంటి పార్టీలూ వున్నాయి.. అవి, అధికారంలోకి వచ్చేసి, అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితుల్లో వుండడమూ...

పుష్ప-2 వీఎఫ్ ఎక్స్ వీడియో.. సుకుమార్ ఇంత మోసం చేశాడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ పుష్ప-2 చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో పెద్దగా వీఎఫ్ ఎక్స్ వాడలేదు అనే చాలా మంది...

Annana pathiya: నెట్టింట థాయ్ పాట ‘అన్నన పాథియే’ సంచలనం.. ఓ లుక్కేయండి..

Annana pathiya: సోషల్ మీడియాతోపాటు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఇటివల బాగా వైరల్ అవుతున్న 'అన్నన పాథియే (Annana pathiya appata ketiya) అనే థాయ్ ల్యాండ్ పాట గురించి తెలిసిందే....