పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం
సూర్యోదయం: ఉ.6:07
సూర్యాస్తమయం: రా.6:04 ని
తిథి: బహుళ అమావాస్య రా.11:31 వరకు తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం )
నక్షత్రము: పూర్వాభాద్ర సా.5:58 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: శుభం మ.1:09 వరకు తదుపరి శుక్లం
కరణం: చతుష్పాద మ.12:31 ని. వరకు తదుపరి కింస్తుఘ్నం
దుర్ముహూర్తం: ఉ.8:30 నుండి 9:18 వరకు తదుపరి రా.10:53 నుండి 11:41 వరకు
వర్జ్యం : రా.3:08 నుండి 4:40 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:23 ని.నుండి 1:53 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:47 నుండి 5:35 వరకు
అమృతఘడియలు:ఉ.10:26:నుండి 11:56 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:59 నుండి 12:47 వరకు
ఈరోజు. (21-03-2023) రాశి ఫలితాలు
మేషం: బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.
వృషభం: కుటుంబ సభ్యుల ప్రవర్తన శిరోబాధ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహాల సూచనలున్నవి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
మిథునం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
కర్కాటకం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి.
సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులందు కార్యాటంకములు తప్పవు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు.
కన్య: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి .వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ద వహించాలి.
తుల: రాజకీయ సభ సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
వృశ్చికం: వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
ధనస్సు: పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
మకరం: ధన సంబంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు.
కుంభం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారులనుండి ప్రశంసలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మీనం: దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి,వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో ఆకారణంగా విబేదిస్తారు.
477494 16791This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward producing the fact goal in mind. shed weight 463830
484438 926848This internet site is in fact a walk-through it genuinely could be the information you desired relating to this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 544902
361696 523412Hey there! This is my 1st comment here so I just wanted to give a quick shout out and tell you I genuinely enjoy reading your blog posts. Can you suggest any other blogs/websites/forums that go over the same subjects? Many thanks! 127243
434005 375861A actually interesting examine, I might not concur totally, but you do make some really valid points. 597376