పంచాంగం
తేదీ 21-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ సప్తమి ఉ 11.36 వరకు తదుపరి అష్టమి
నక్షత్రం: చిత్త రా. 10.30 వరకు తదుపరి స్వాతి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.46 నుంచి 11.36 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప. 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసర ఖర్చుల జోలికి పోవద్దు. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి తిరిగి వసూలవ్వడం కష్టమవుతుంది. మనసు చెడు ఆలోచనల వైపు మల్లుతుంది. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త బాధ కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ వాగ్వాదానికి దిగరాదు. మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు తలెత్తుతాయి. గిట్టని వారు రెచ్చగొట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి: గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చేపట్టిన పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు ఒడిదుడుకులతో కూడిన ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
సింహరాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించాలని చూస్తారు. కొన్ని సమయాల్లో ఆరోగ్యం సహకరించదు. జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా ఆస్తి నష్టం జరుగుతుంది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
కన్యారాశి: ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సత్ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.
తులారాశి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించండి. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమిస్తారు.
వృశ్చిక రాశి: మిశ్రమ కాలం. అందర్నీ కలుపుకొని పోవాలి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
ధనస్సు రాశి: అదృష్ట కాలం కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య నుంచి బయటపడతారు. చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మకర రాశి: చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కొంత ఆస్తి నష్టం జరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. వృధా ప్రయాణాలు చేస్తారు.
కుంభరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మీన రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. మీ ప్రతిభతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల మద్దతు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.