Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 21-02-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: బహుళ అష్టమి ఉ 8.20 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: అనురాధ మ. 12.46 వరకు, తదుపరి జ్యేష్ఠ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: అదృష్ట కాలం. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృషభ రాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక సంతోషాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిధున రాశి: మీ ప్రవర్తనతో ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కుటుంబంలో అనవసరమైన విభేదాలు తలెత్తుతాయి. ఆప్తుల ప్రవర్తనతో కలత చెందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు తోడవుతాయి. ఆరోగ్యం స్వల్పంగా క్షీణిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి.

కర్కాటక రాశి: ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

సింహరాశి: కుటుంబంలో ఆహ్లాద తర్వాత వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు అందుతాయి. న్యాయవాద రంగంలో ఉన్నవారికి ఊహించని పదవీ బాధ్యతలు అందుతాయి. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్య రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆప్తులతో మాట పట్టింపులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. అనవసర ఖర్చులు పెరిగినప్పటికీ రుణాలు జోలికి పోవద్దు.

తులారాశి: అనుకూల సమయం.సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. అవసరానికి బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వ్యాపారులు విశేషమైన లాభాలు పొందుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. వ్యక్తిగత సమస్యలను ఇంటి పెద్దల జోక్యంతో పరిష్కరించుకుంటారు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.

ధనస్సు రాశి: మిశ్రమకాలం. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ప్రత్యర్థులు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. వ్యాపార భాగస్వామ్యుల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

మకర రాశి: అదృష్ట కాలం. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

కుంభరాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి.

మీన రాశి: మిశ్రమకాలం. పని భారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృశ్చికంలో ఆర్థిక లాభాలు, మకరంలో ఉద్యోగావకాశాలు

ఫిబ్రవరి 15, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితం ఇస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వింటారు. ఖర్చులు...

అసెంబ్లీకి రాకుండా డ్రామాలేనా? వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ అనేది ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కాదు, డ్రామాలు చేసే పెద్ద కంపెనీలా మారిందని జనసేన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా...

Daily Horoscope: వృశ్చికంలో లాభ సూచనలు, మకరంలో ఉద్యోగ పురోగతి

ఫిబ్రవరి 14, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో కొంత ఆలస్యం కనిపించవచ్చు. అనవసరంగా కోపం చూపకుండా సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా...

Ram Charan: కవలలకు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31, 2025న కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒక బాబు, పాప వీరికి జన్మించారు. కొణిదెల, కామినేని కుటుంబసభ్యులే...

పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళం: జనసేన కొత్త సభ్యత్వానికి శ్రీకారం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి...