పంచాంగం
తేదీ 21-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు.
తిథి: బహుళ అష్టమి మ. 1.49 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ 8.03 వరకు తదుపరి శ్రవణం
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, తదుపరి 2.46 నుంచి 3.12 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి.సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. పెద్దల సమక్షంలో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను, పనులను వాయిదా వేయండి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి: మిశ్రమకాలం. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించండి.
కర్కాటక రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనూహ్యమైన లాభాలు అందుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహరాశి: అనుకూల సమయం. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంపద పెరుగుతుంది. ప్రతిభతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది.
కన్య రాశి: విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
తులారాశి: అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. న్యాయవాద వృత్తుల వారు శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.
వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరుగుతుంది. ఇంటి పెద్దల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా వాటిని నిర్వర్తించగలుగుతారు. మీ ప్రతిభతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు.
మకర రాశి: అదృష్ట కాలం. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోట స్థానచలనం లభిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కుంభరాశి: సంపద పెరుగుతుంది. అవసరానికి తగిన ఆర్థిక సాయం అందుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు.
మీన రాశి: మిశ్రమ కాలం. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. అదనపు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. సంపద సృష్టిపై శ్రద్ధ పెట్టాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయమవుతుంది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. అరువు తెచ్చుకున్న వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి.